You are here
Home > Uncategorized > వచ్చేనెల 9 కి వస్తా అంటే ఇప్పుడు నీ గ్రహబలం బాగా లేదా..??? లేక చాత కాకనా ..???

వచ్చేనెల 9 కి వస్తా అంటే ఇప్పుడు నీ గ్రహబలం బాగా లేదా..??? లేక చాత కాకనా ..???

Spread the love

రేవంత్ ముహూర్తం చూసి రంగం లో దిగడానికి నువ్వేమైనా మూడు నిద్రలకు పోతున్నావా?

సమస్య వచ్చినప్పుడు సత్వరమే స్పందిన్చేవాడే సిపాయ్.యుద్ధం వచ్చిన మరుక్షణమే రణరంగం లో దూకేవాడే నిజమైన యోధుడు.ఒకవైపు శత్రు సైన్యం దూసుకువస్తున్నా,ఇగ వస్తా,ఇగ సూస్కోండ్రి,నేను దిగుడే లేట్ దిగినా అంటే ఖతమే.కత్తి నూరుతున్నా,నూరుడు కాంగనే వస్త,ఇయ్యాల అమాస,తోమ్మోదో తారీఖు మంచి రోజు ఉన్నది ఇగ ఆరోజే యుద్ధం చేస్తా అంటే అప్పటికే ఉన్నది ఊశిపోతది.శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వం అలాంటి ధర్నాలకు,ఆందోళనలకు అనుమతి ఇవ్వదు.మీ ప్రభుత్వ హయాములోనే కదా,కరంట్ కోసం ఆందోళన చేస్తాము అని రైతులు రోడ్ల మీదికి వస్తే ఎందుకు అనుమతి ఇవ్వలేదు,అనుమతి ఇవ్వకున్నా వచ్చినందుకు వాళ్ళను కాల్చిపాదేసింది నీ ప్రభుత్వం అలాంటివి జరగాలని కోరుకుంటున్నావా?

ఇక సన్ బర్న్ అనేది,తాగి ఊగే  పార్టీ కాదు అదొక ఫెస్టివల్. CNN ప్రకారం అది టాప్ టెన్ ఫెస్టివల్స్ లో ఒకటిగా పేరుగాంచింది. దానిని EDM ఎలెక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ అంటారు.అది ప్రతీ ఏటా ఆ ఫెస్టివల్ ను  మన దేశంలో నిర్వహిస్తుంది.గోవా లో రెగ్యులర్ గా నిర్వహించింది,గత ఏడాది పూనాలో నిర్వహించింది.ఇక్కడ నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి,ఈ సన్ బర్న్ ఫెస్టివల్ ను (BITS) birla institute of technology and science లో ,ఎన్నో ప్రసిద్ధి చెందిన IIT ల్లో,నిర్వహించడానికి అనుమతులు ఇచ్చారు.అయినా ఈ  ఫెస్టివల్ ను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.ఉంటె చూయించు.సన్ బర్న్ ఫెస్టివల్ ను రేవ్ పార్టీలతో,తీన్మార్ డాన్సులతో,న్యూ ఈయర్ పార్టీలతో,రికార్డింగ్ డాన్సులతో పోల్చకు.నీకు అంతకన్నా ఎక్కువ తెలిసే అవకాశమే లేదనుకో.

మెట్రో సిటీలలో పబ్బులు ఉండడం తప్పని తద్దినం.మనకు విదేశీ పెట్టుబడులు రావాలి,విదేశీ మారకం రావాలి,వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించాలి,మన వాళ్ళకు లక్షల్లో జీతాలు ఇవ్వాలి అని మనం కోరుకున్నట్టే,వాళ్ళు కూడా వాళ్ళ జీవనవిధానం లో భాగంగా పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి పబ్బులు ఉండాలని కోరుకుంటారు.అవి అందుబాటులో ఉంచడం మనకు తప్పదు.వాళ్ళను ఇరాని చాయ్ కేఫ్ లకు అయితే పంపము కదా.డబ్బున్న వాడే పబ్బులకు పోతాడు,డబ్బు లేని వాడు వాడి కష్టార్జితాన్ని గుడుంబా తాగి లేక పేకాట ఆడి పోగొట్టుకుంటాడు.అతని కష్టార్జితాన్ని కాపాడడం మనుషులుగా మాన ధర్మం,అందుకే ఆ రెండినిటినీ మూయించేసాడు కేసీఆర్ ,దాని గురించి ఎందుకని మాట్లాడవు?

Top