You are here
Home > National News > తీస్మార్ ఖాన్ వచ్చిండయ్యా?.

తీస్మార్ ఖాన్ వచ్చిండయ్యా?.

Spread the love

 

  • తీస్మార్ ఖాన్ వచ్చిండయ్యా?.
  • చట్టాలు, కోర్టులు అన్నీ ఈ బుడ్డరఖానే ఇగ.
  • క్యాచ్ మెంట్ ఏరియాలో బిల్డింగ్ కడితే జైలుకేనట.
  • కొత్త సెక్రటేరియేట్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలివి?.
  • ప్రభుత్వం ఏమీ కొత్తగా కట్టడం లేదు మోతుబరి.
  • పాతవాటి స్థానంలో.. అదే సామర్థ్యంతో పున:నిర్మాణం చేస్తోంది.

కొత్త సెక్రటేరియేట్ కట్టడం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వ్యతిరేకమని అపరమేధావి రేవంతుడు మాట్లాడుతుండు. కాళేశ్వరం కట్టే సమయంలో కూడా ప్రాజెక్టులు, కాలువలకు ఎన్జీటీ పర్మీషన్ రాకుండా ఎన్నో కేసులు వేశారు. కాంగ్రెస,బీజేపీ, టీజేఎస్ సహా అన్ని పార్టీలు.. కాళేశ్వరాన్ని వ్యతిరేకించాయి. కిందిస్థాయి కోర్టుల నుంచి సుప్రీం వరకు ఆఖరికి గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసులు వేశాయి. కానీ.. ఒక్కటీ నిలబడ లేదు. ఎన్జీటీ అన్నింటికీ పర్మీషన్ ఇచ్చింది. ప్రజా ఉపయోగకరమైన ఏ కట్టడమైనా ఆపొద్దని స్వయంగా సుప్రీంకోర్ట్ ఆదేశాలున్నాయి. ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలియదనుకుంట.

అందుకే హుస్సేన్ సాగర్ క్యాచ్ మెంట్ ఏరియా అంటూ ఇక్కడ కొత్త నిర్మాణాలు ఎన్జీటీ చట్టానికి విరుద్ధం అంటున్నారు. ఎన్జీటీ చట్టానికి ముందే అక్కడ భారీ నిర్మాణాలు ఉన్నాయి. వాటిస్థానంలో పున:నిర్మాణాలు చేస్తామంటోంది ప్రభుత్వం. అంతేకానీ.. కొత్తగా ఏవీ కన్ స్ట్రక్చన్ చేస్తామని చెప్పడం లేదు. పాత భవనాలు శిధిలావస్థకు చేరాయి. ఎక్కడా సరైన వసతులు లేవు. దీంతో.. కొత్త సెక్రటేరియేట్ నిర్మాణం అనివార్యం అయింది. ప్రభుత్వం ఏం చేసినా.. ప్రజలకు చెప్పే చేస్తుంది. వారి సమ్మతి తీసుకుంటుంది. కొత్త సెక్రటేరియేట్ కడతామని ఎన్నికల సమయంలో ప్రజలకు సీఎం కేసీఆర్ చెప్పారు. అది అంగీకరించే క్లీన్ మెజార్టీ ఇచ్చారు.

కొత్త సెక్రటేరియేట్ కడితే.. టీఆర్ఎస్ కు, సీఎం కేసీఆర్ కు ఎక్కడ పేరు వస్తుందోనని.. కాంగ్రెస్ నాయకుల ఆరాటం తప్ప.. ఇందులో విమర్శించడానికి ఏమీ లేదు. కోర్టుల్లో కేసులు వేసినా.. అవి చెల్లుబాటు కాలేదు. త్వరలోనే కొత్త సెక్రటేరియేట్ తయారవ్వబోతోంది. ప్రభుత్వం వేగంగా నిర్మిస్తే.. సీఎం కేసీఆర్ సెక్రటేరియేట్ నుంచి పాలన మొదలు పెడితే.. అద్భుతమైన పథకాలు తీసుకొస్తే.. తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది. అందుకే సెక్రటేరియేట్ కూల్చివేతపై అనవసర రాద్దాంతం చేస్తున్నారు.

Top