You are here
Home > Latest News > రేవంత్ రెడ్డి.. నువ్వు మనిషివా.. ఇంకేదైనా జీవీవా…

రేవంత్ రెడ్డి.. నువ్వు మనిషివా.. ఇంకేదైనా జీవీవా…

Spread the love

 

  • రేవంత్ రెడ్డి.. నువ్వు మనిషివా.. ఇంకేదైనా జీవీవా…
  • క‌రోనాపై కూడా రాజకీయ చేస్తున్న నీకు బుద్ధి లేదు…
  • ఇప్పటికైనా తగిన‌ బుద్ధి తెచ్చుకుని వ్యవహరించు..
  • లేకపోతే నీ పతనం తప్పదని తెలుసుకో...

 

తెలంగాణ రాజకీయ బఫూన్‌, ఆర్థిక ఉగ్రవాది రేవంత్ రెడ్డి మళ్ళీ తన నోటికి పని చెప్పాడు. నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా హాస్టల్లు మూసివేయడంతో కొంతమంది తమ ఊళ్లకు వెళ్లడానికి పోలీసులను పర్మిషన్ కోసం బ‌తిమిలాడారు. వాళ్ల ఇబ్బందులను చూసి చలించిపోయిన పోలీసులు వాళ్లకు పర్మిషన్ లెటర్ ను ఇవ్వడంతో ఆంధ్రప్రాంతానికి బయలుదేరారు. అయితే సరిహద్దులు దాటిన తర్వాత ఆంధ్ర పోలీసులు వారి ప్రాంతాలకు చెందిన వ్యక్తులను  కూడా అనుమతించలేదు.

వీరిపై రాజకీయ బుడ్డర్ఖాన్ రేవంత్ రెడ్డి అనవసరంగా సోషల్ మీడియాలో తన పైత్యాన్ని క‌న‌బ‌రుస్తున్నాడు. మానవత్వంతో వ్యవహరించిన తెలంగాణ ప్రభుత్వం పైన ఉల్టా నిందలు వేస్తూ తన పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇలాంటి రాజకీయ నేతలను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎంతసేపు తన రాజకీయ మైలేజీ చూసుకోవడం తప్పించి ప్రజల బాధను ఏమాత్రం పట్టించుకోని ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.

నిజానికి ప్రతిపక్షాలు సహకరించకున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్పై పోరాడడానికి ఎంతగానో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌ కనబరిచింది. ముఖ్యంగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి అధికారులతో సమన్వయం పాటించారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి అంతగా లేదు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఈ స‌మ‌యంలో కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూడడం ఏమాత్రం సరికాదు.

ఇలాంటి సంక్షోభ పరిస్థితులలో కూడా వాళ్ల‌ రాజకీయాల‌ను చూసిన వీళ్ళను చూసి అంతా అస‌హ్య‌పడుతున్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించే ప్రభుత్వానికి సహకరించాలని గడ్డి పెడుతున్నారు. ఏదేమైనా ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎవరూ వాళ్లకు సహాయం చేస్తారో ఎవరు వాళ్లను ఆందోళనకు గురి చేస్తారో మరోసారి స్పష్టత వచ్చింది.

Top