You are here
Home > Uncategorized > ఎవరిది గోల్ మాల్? ఎవరిది అవినీతి?.. నిజాలు మాట్లాడుకుందామా?

ఎవరిది గోల్ మాల్? ఎవరిది అవినీతి?.. నిజాలు మాట్లాడుకుందామా?

Spread the love

 

ఎవరిది గోల్ మాల్? ఎవరిది అవినీతి?.. నిజాలు మాట్లాడుకుందామా?

– భూ కబ్జాలు చేసే రేవంత్ నోటి నుంచి పతివ్రత మాటలు

– ఆధారాలే లేకుండా.. తప్పుడు కూతలతో జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు

– వంకర మాటలు ఆపాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు

ఏం సంగతి రేవంత్ రెడ్డీ.. ఏ మాట్లాడుతన్నవ్ నువ్వు? కోకా పేట భూముల వేలం ప్రక్రియ.. నిబంధనలకు అనుగుణంగా పూర్తి ప్రజాస్వామిక పద్ధతిలో జరిగితే.. ఎవరో కొందరికే లాభం కలిగేలా ప్రక్రియ పూర్తయిందని అనేందుకు నీకు నోరెలా వస్తోంది? కేసీఆర్ అనుకూల వ్యక్తులకే ఎక్కువగా భూములు దక్కాయని ఆరోపణలు చేస్తున్నావే.. అది సరైన ప్రక్రియ ద్వారానే జరిగిందన్న వాస్తవాన్ని ఎందుకు మరుస్తున్నవ్? ఎందుకింతగా తప్పుడు ప్రచారాలకు తెగబడ్తున్నవ్?

విమర్శలు, ఆరోపణలు చేసేముందు.. కాస్తైనా మనస్సాక్షితో మాట్లాడుకోవాలి. గతంలో నువ్వు చేసిన రాజకీయ వ్యభిచారమేంది? భూ కబ్జాలు చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న విషయమేంది? జైలు జీవితం గడిపి ఇప్పుడు బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యవహారమేంది? వీటి గురించి నిన్ను జనం ప్రశ్నిస్తరనే భయంతోనే అవసరం లేకున్నా అవకాశం చూసుకుని మరీ ఇంత తప్పుడు ప్రచారాలు చేస్తున్నవని అందరికీ అర్థమవుతోంది.

నువ్వు చేసే ఆరోపణలకు ఆధారాలే లేవు. పైగా.. ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగింది. అయినా.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. అంటున్నవ్. చర్యలు తీసుకోకుంటే.. ఇద్దరి మధ్యా దోస్తీ ఉందని జనానికి చెప్తా.. అని నువ్వే అంటున్నవ్. అంటే.. కేసీఆర్ చేసినదాంట్లో ఏ తప్పూ లేదని.. కాబట్టి కేంద్రం నీ ఫిర్యాదుకు స్పందించే అవకాశం లేదని.. అప్పుడు మళ్లీ ఈ విషయంలో రాజకీయం చేయవచ్చని.. నువ్వు లాంగ్ టర్మ్ స్ట్రాటజీని వరెస్ట్ గా అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

ఇంతకన్నా పనికిమాలిన రాజకీయం ఇంకోటి ఉంటుందా రేవంత్ రెడ్డీ? కాంగ్రెస్ కు మరో దిక్కు లేక.. పార్టీని నడిపించే నేత లేక.. దొంగవైన నిన్ను, లంగవైన నిన్ను ముందు పెట్టింది ఆ పార్టీ. ఆ భిక్షాన్ని చూసుకుని.. ఒకేసారి వంద కోట్ల జాక్ పాట్ కొట్టినట్టు.. అడ్డదిడ్డంగా.. వంకర వంకరగా మాట్లాడుతన్నవ్ రేవంత్ రెడ్డీ. ఇలాంటివే.. కాస్త తగ్గించుకుంటే.. నీకు మాత్రమే కాదు.. నీ పార్టీకి, అందులో ఉన్న కార్యకర్తలకు సైతం మంచిదని గుర్తించు. ఆ తర్వాత మాట్లాడు.

Top