You are here
Home > Uncategorized > విమర్శలు కాదు.. వాస్తవాలు తెలుసుకో.. చరిత్ర చదువుకో..!

విమర్శలు కాదు.. వాస్తవాలు తెలుసుకో.. చరిత్ర చదువుకో..!

Spread the love

 

విమర్శలు కాదు.. వాస్తవాలు తెలుసుకో.. చరిత్ర చదువుకో..!

– బీఎస్పీలో చేరేందుకు నిర్ణయించుకున్న విశ్రాంత ఐపీఎస్ ప్రవీణ్ కుమార్

– గతంలో బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు.. ఇప్పుడు టీఆర్ఎస్ లో కీలక లీడర్లు

– తెలంగాణలో రాజకీయాలైనా.. సంక్షేమమైనా టీఆర్ఎస్ తోనే అంటున్న జనాలు

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో గురుకులాలను ఆరేళ్ల పాటు సమర్థంగా నడిపించిన పేరు సంపాదించుకున్న అధికారి. ఇటీవల విధుల నుంచి తప్పుకొని స్వచ్ఛందంగా విశ్రాంతి తీసుకున్న ఆయన.. రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. అధికార పక్షంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో రాబోతున్న ఆయన.. విమర్శలు చేస్తే తప్పులేదు కానీ.. వాస్తవాలు పక్కదారి పట్టిస్తేనే.. అసలు సమస్య. అది ప్రస్తుతానికి వేరే విషయం.

కానీ.. రీసెంట్ గా వినిపిస్తున్న గుసగుస ఏంటంటే.. ఆయన బహుజన్ సమాజ్ పార్టీలో చేరతారట. అందుకు ఆగస్టు 8ని ముహూర్తంగా ఖరారు చేసుకున్నారట. ముందుగా.. ఆయన టీఆర్ఎస్ లో చేరతారని.. అదనీ ఇదనీ చాలా వదంతులు వినిపించాయి. చివరికి.. బీఎస్పీలో చేరి.. తన భావజాలానికి అనుగుణంగా నడుచుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మంచిదే. నిర్ణయం ఆయనిష్టం. మనం తప్పుబట్టేందుకు ఏమీ లేదు.

కానీ.. ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమంగా.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుంది. నో డౌట్. బహుజన్ సమాజ్ పార్టీ కూడా అంతే. అయితే.. 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పుడు.. టీఆర్ఎస్ సొంతంగా అధికారాన్ని దక్కించుకున్నప్పుడు బీఎస్పీ సైతం 2 సీట్లు గెలుచుకుంది. ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప.. ఆ పార్టీ నుంచి గెలిచారు. తర్వాత.. ఆ ఇద్దరూ ప్రజా సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు టీఆర్ఎస్ లో చేరారు.

ఇది గుర్తు చేస్తున్న ప్రజలు ఏమంటున్నారంటే.. బీఎస్పీ అయినా మరే పార్టీ అయినా.. చివరికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజోపయోగ కార్యక్రమాలను అంగీకరించాల్సిందే అని. రాజకీయ ఏకీకరణ అన్నది ఒక్క టీఆర్ఎస్ తోనే సాధ్యమని. ఈ విషయాన్ని ప్రవీణ్ కుమార్ గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయాన్ని సైతం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఎస్పీతో బహుజనులకు అధికారం అన్నది.. ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేస్తున్నారు.

Top