You are here
Home > Latest News > అంత అసూయ ఎందుకు రేవంత్..?

అంత అసూయ ఎందుకు రేవంత్..?

Spread the love

అంత అసూయ ఎందుకు రేవంత్..?

కేటీఆర్ సమర్ధత ఏంటో కేసీఆర్ కు తెలుసు. కేటీఆర్ ను సీఎం చేయడు కేసీఆర్…కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కేటీఆర్ ను సీఎం చేయడు కేసీఆర్ అన్న విషయం పక్కన పెడితే…కేటీఆర్ సమర్థత ఏంటో కేసీఆర్ కు తెలుసు. అవును ఓ కొడుకు సామర్ధ్యం సంగతి తండ్రికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అన్నది నిజం. కేటీఆర్ సామర్థ్యం ఏంటో గ్రహించారు కాబట్టే..కేసీఆర్ బహుశా కేటీఆర్ ను సీఎంను చేయాలని భావిస్తున్నారేమో. అయితే కొడుకు గొప్పతనం తండ్రి ఒక్కడు గ్రహిస్తే చాలా…రాష్ట్రానికి సీఎం కావాలంటే ఆ అర్హత ఒక్కటి చాలా..? సరిపోదు. కొడుకు సామర్థ్యం, ప్రత్యేకత..ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి ఒక్కడు గ్రహిస్తే చాలదు.

రాష్ట్రానికి నాయకత్వం వహించే పదవి కాబట్టి అందరి ఆమోదం ఉండాలి. ముందుగా టీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో గెలిపించారు…కాబట్టి..కేసీఆర్ నంచి సీఎం పదవి అందుకోవడానికి కేటీఆర్ కు పార్టీ నేతల మద్దతు కావాలి. పదేల్లగా తండ్రి అడుగుజాడల్లో నిలుస్తూ..తెలంగాణ ఉద్యమంలో పోరాడి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విశేష క్రుషి చేసిన కేటీఆర్ గురించి టీఆర్ఎస్ లో తెలియని వాల్లెవరూ లేరు. ఆయన నాయకత్వ లక్షణాలు, ప్రజల పట్ల అంకిత భావం అన్నీ దశాబ్దకాలానికి పైగా టీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి గమనించారు. అందుకే కేటీఆర్ ను సీఎంను చేయాలని కోరుతున్న పార్టీ నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మొదలుకుని జిల్లా స్థాయి నేతల దాకా అందరూ కేటీఆర్ ను సీఎంను చేయమని పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారు.

ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ఉద్దేశమూ అదే. కేటీఆర్ ను సీఎంగా చూడాలని కార్యకర్తలంతా ఆకాంక్షిస్తున్నారు. ఆ ముహూర్తం కోసం వేయికల్లతో ఎదరుచూస్తున్నారు. ఇక ప్రజాస్వామ్యంలో అన్ని విషయాల్లో అంతిమ తీర్పు ఇచ్చే ప్రజలను గమనిస్తే…తెలంగాణకు కేటీఆర్ ను మించిన సమర్థ నాయకుడు ఇంకెవరూ ఉండరన్నది అందరనూ అనే మాట. ప్రజలకు చేరువకావడంలో, ప్రజాసమస్యలు పరిష్కరించడంలో, అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో తండ్రిని మించిన తనయుడిగా ఆయన ఎప్పుడో గుర్తింపు పొందారు. 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె, ఇవాంక ట్రంప్ పర్యటన కార్యక్రమాన్ని కేటీఆర్ పర్యవేక్షించిన తీరు, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విధానం కేటీఆర్ నాయకత్వ లక్షణాలను చెప్పకనే చెప్పాయి. ఇక అన్ని ఎన్నికల్లోనూ పార్టీని నడిపించిన విదానమే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కట్టబెట్టింది. రాజకీయ ప్రత్యర్ధులు, గిట్టనివాల్లు ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ..కేటీఆర్ సీఎం కావడాన్ని తెలంగాణ ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నది అందరూ అంగీకరించాల్సిన సత్యం. ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించి…పార్టీలు మారి..రాజకీయ భవిష్యత్ ఏంటో దిక్కుతోచక అల్లాడుతున్న రేవంత్ రెడ్డికి సహజంగానే కేటీఆర్ పై అసూయాద్వేషాలు ఉండడం సహజం. అందుకే కేటీఆర్ ముఖ్యమంత్రి కానున్నరన్న ప్రచారం రేవంత్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

 

 

 

Top