You are here
Home > Latest News > ఊళ్లో పెళ్లికి.. ఏదో హడావుడి అంటే ఇదే..!

ఊళ్లో పెళ్లికి.. ఏదో హడావుడి అంటే ఇదే..!

Spread the love

 

ఊళ్లో పెళ్లికి.. ఏదో హడావుడి అంటే ఇదే..!

– డ్రామా ఆర్టిస్టులు.. గంటకు వంద బాపతుగాళ్లతో రేవంత్ హంగామా

– కాంగ్రెస్ కార్యక్రమంలా కాక.. బ్యాండ్ బాజా ప్రోగ్రాం మాదిరిగా ప్రమాణం

– పండగ అయిపోయింది.. ఇగ మిగిలింది దండగే.. అంటున్న జనం

రాజకీయ వ్యభిచారి. ఆర్థిక నేరగాడు. జైలు జీవితం గడిపి బెయిలుపై బయట ఉంటున్న ప్రజాస్వామ్య ద్రోహి. తెలంగాణ వ్యతిరేకులకు నమ్మకస్తుడు. వాళ్ల కనుసన్నల్లో మెలుగుతూ తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తి. అన్నిటికీ మించి.. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు.. ఎవలయ్యా అంటే.. చెడ్డీగాళ్లు కూడా చెప్తరు… రేవంత్ రెడ్డి అని. అసోంటి రేవంత్ రెడ్డికి.. ఏ దిక్కూ లేక.. కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ ను చేస్తే.. ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

రాజకీయాలకే ప్రాణం ఉంటే సిగ్గుపడేలా.. సామాన్యులంతా తెగ ఆవేదన చెందేలా.. ఆత్మాభిమానం ఉన్న వాళ్లంతా సిగ్గుపడేలా.. ఆఖరికి కాంగ్రెస్ నేతలు సైతం ఆవేదన చెందేలా.. రేవంత్ రెడ్డి ప్రవర్తించాడు. భారీ జనాన్ని వెంటేసుకుని డ్రామా ఆర్టిస్టులతో జబర్దస్త్ షో చేసినట్టు కథ నడిపాడు. కరోనా వేళ ఇన్నాళ్లూ జనాలు చస్తూ బతికిన వైనం మరిచి వేలాది మంది పెయిడ్ ఆర్టిస్టుల మాదిరి జనాన్ని వెంటేసుకుని ప్రదర్శన చేసిండు.

పీసీసీ పదవి రాగానే ముఖ్యమంత్రి అయినట్టు.. రాబోయే కాలానికి కాబోయే ప్రధానిని అన్నట్టు.. విచిత్రమైన హావభావాలతో పదవీ స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు రేవంత్. ఇదంతా చూసి.. బాగా ఎంజాయ్ చేసిన జనం.. ఇన్నాళ్లూ థియేటర్లు లేక చాలా బోర్ ఫీలయ్యామని.. ఇప్పుడు మాత్రం కావాల్సినంత వినోదం దొరికిందని అంటున్నరు. పండగ అయిపోయింది కాబట్టి.. పదవి దక్కించుకున్న దండగ మనిషి రేవంత్ ఒక్కడే మిగిలిండని చెబుతున్నరు.

జీవితానికి సరిపడా రాజకీయ పండగ చేసుకున్న రేవంత్ కు.. ఇగ చేసుకునేందుకు పండగంటూ ఉండదని అంటున్న జనం.. తెలంగాణకు ద్రోహం తలపెట్టేలా తేడా కథలు పడ్తె మాత్రం తోక కత్తిరిస్తం బిడ్డా.. అని హెచ్చరిస్తున్నరు. ఓటుకు నోటు లాంటి కథలు చంద్రబాబు దగ్గర చేసుకోవాల్నని.. పీసీసీ చీఫ్ పేరుతో అలాంటి కథలు పడినవంటె రాజకీయంగా సమాధి అవుడు ఖాయమని తేల్చి చెబుతున్నరు. రేవంత్ రెడ్డీ… బీ కేర్ ఫుల్. పబ్లిక్ ఆర్ వాచింగ్.

Top