You are here
Home > Uncategorized > సంజయ్.. మోదీని, నడ్డాను ఇలాగే అంటే ఊరుకుంటావా?

సంజయ్.. మోదీని, నడ్డాను ఇలాగే అంటే ఊరుకుంటావా?

Spread the love

 

సంజయ్.. మోదీని, నడ్డాను ఇలాగే అంటే ఊరుకుంటావా?

స్థిమితంగా ఉండి కూడా అదుపు తప్పి మాట్లాడతున్న బండి సంజయ్

తలాతోకా లేని విమర్శలతో రాజకీయంగా అభాసుపాలు అవుతున్న వైనం

గెలుపును, పదవిని.. అవగాహనరాహిత్యంతో తక్కువ చేసుకుంటున్న తీరు

అందుకే అంటారు మన పెద్దలు. నడమంత్రపు సరి మంచిది కాదని. ఎందుకు గెలిపించామురా బాబూ.. ఓట్లేసినందుకు పరువు పోతోంది అని కరీంనగర్ ప్రజలు అవమానంగా భావిస్తున్న వేళ.. వారు ఓటు వేసిన సమయం కలిసి వచ్చిందో ఏమో.. బండి సంజయ్ అలా ఎంపీ అయ్యాడు.. ఆ వెంటనే ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. మరే గతీ లేని పరిస్థితిలో బీజేపీ నాయకత్వం ఈయనకు పదవి అప్పగించిందని.. సరైన నాయకుడు లేకనే సంజయ్ కు అదృష్టం పట్టిందని సామాజిక మాధ్యమాలు కూడా కోడై కూశాయి.

అంతటి అదృష్టం పడితే.. ఇలా అనామకుడిలా వ్యవహరిస్తున్న సంజయ్ ను చూసి ఏమనుకోవాలి చెప్పండి? ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని పట్టుకుని తలకాయ లేదని అంటే.. అతడిని ఎలా తన్నాలి… ఎక్కడికి తరమాలి? అసలు ముందు ఇతనికి తలకాయ ఉందో లేదో చూసుకోవాలని చెప్పండి.. అని జనాలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇంతటి నీఛమైన కామెంట్లు చేస్తున్నాడో చెప్పాలని సంజయ్ ను డిమాండ్ చేస్తున్నారు.

కేసీఆర్ కు దమ్మేంటో చూపిస్తామని సవాల్ విసురుతున్న సంజయ్ కు.. ప్రజలు ఏకగ్రీవంగా ఒకే మాట చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ సత్తా ఏంటో తమ ఓట్ల రూపంలో పదే పదే బీజేపీకి రుచి చూపించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో సైతం.. బీజేపీని బరి నుంచి తప్పిస్తామని గిరి గీసి మరీ చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి ఎవరి మోచేతి నీళ్లు తాగాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికైనా సరిగా మాట్లాడకుంటే.. తగిన రీతిలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సంజయ్ అంటున్న మాటలను.. మోదీ గురించో.. లేక నడ్డా గురించే.. కాదంటే అమిత్ షా గురించో ఇలాగే మాట్లాడి బీజేపీ నేతలు సహించగలరా.. అని ప్రజలు నిలదీస్తున్నారు. ఆ పరిస్థితే వస్తే.. జాతీయ నేతలను సైతం తరిమికొట్టి తెలంగాణ సాధించుకున్న తమ నోటి నుంచి వచ్చే మాటలకు.. నిఖార్సైన విమర్శలకు.. మోదీ బ్యాచ్ తట్టుకోలేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా తన పనేదో తను చూసుకోవాలని… చేతనైతే తమకు మంచి చేయాలని ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలు సైతం డిమాండ్ చేస్తున్నారు.

Top