You are here
Home > Latest News > ప్రజలకు మంచి పాలన అందొద్దనేనా మీ బాధ?

ప్రజలకు మంచి పాలన అందొద్దనేనా మీ బాధ?

Spread the love
  • ప్రజలకు మంచి పాలన అందొద్దనేనా మీ బాధ?
  • తెలంగాణను నాశనం చేయడానికి అఖిల పక్ష నేతలు కలుస్తారు
  • తెలంగాణ బాగు కోసం మాత్రం కలవరు
  • ఇదేనా మీకు తెలంగాణపై ఉన్న ప్రేమ

అఖిలపక్ష నేతలు అంతా కలిశారు. అంతా ఒక్కటయ్యారు. దేని కోసం.. తెలంగాణ కోసమా? తెలంగాణ బాగు కోసమా? తెలంగాణ సమస్యలపై పోరాటం కోసమా? లేక.. ఇంకా దేని కోసం. ఓ మంచి పనికి అడ్డుతగలడం కోసం కలిశారు. వాళ్లు ఎప్పుడైనా అంతే కదా.

తెలంగాణలో మంచి జరుగుతుందంటే.. ఆ మంచిని ఎలాగైనా ఆపాలన్న దురుద్దేశంతో వీళ్లు కలుస్తుంటారు. వీళ్లను ఏమనాలి. తెలంగాణపై మొసలి కన్నీరు కార్చే వీళ్లకా తెలంగాణపై ప్రేమ ఉన్నది. వీళ్లకు తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే.. ప్రజలకు  మంచి పాలన అందించడం కోసం… ప్రజలకు సరైన పాలన ఇవ్వడం కోసం సీఎం కేసీఆర్ కొత్త అసెంబ్లీ, సచివాలయం భవనాలను కడుతుంటే.. వాటిని కట్టొద్దు అంటూ అడ్డు పడటం ఏంది.

ఏం జానారెడ్డి.. ఇదేనా మీ రాజకీయం. ఇదేనా మీకు ఉన్న రాజకీయ అనుభవం. కొత్త భవనాలను కట్టడం అనేది ప్రజల సౌలభ్యం కోసమే. ప్రజలకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండటం కోసమే. సీఎం కేసీఆర్ ఏది చేసినా ప్రజల కోసమే చేస్తారు. ప్రజల శ్రేయస్సు కోసమే పాటు పడుతారు.

తెలంగాణ బాగుపై ఏనాడైనా అఖిల పక్ష నేతలంతా కలిశారా? గవర్నర్ ను కలిసి వినతి ఇచ్చారా? లేదు. ఇప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం.. ప్రజల మంచి కోసం.. ప్రతి సాధారణ పౌరుడికి ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి.. వాళ్ల సమస్యలను పరిష్కరించడం కోసం కావాల్సిన ఏర్పాట్లను సీఎం కేసీఆర్ చేస్తుంటే మధ్యలో వీళ్ల చేష్టలు ఏంది. దీన్ని ఏమనాలి. వీళ్లను ఏం చేయాలి. ఇలాంటి వాళ్లను ఏం చేయాలో తెలంగాణ ప్రజలే డిసైడ్ చేయాలి. అడుగడుగునా తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లుతూ… అసత్యపు ప్రచారాలు చేస్తున్న వీళ్ల ఆట కట్టించాల్సిందే. వీళ్లను ఎన్నిసార్లు ఓడించినా బుద్ధి రావడం లేదు.

Top