You are here
Home > Inter National News > పిచ్చోడి చేతిలో రాయిలా పాలన జరిగింది కాంగ్రెస్ హయాంలోనే షబ్బీర్

పిచ్చోడి చేతిలో రాయిలా పాలన జరిగింది కాంగ్రెస్ హయాంలోనే షబ్బీర్

Spread the love

 

  • తెలంగాణలో అధికారం లేకపోయే సరికి ఇప్పుడు పిచ్చోళ్లు అవుతున్నారు మీరు..
  • అధికారం కోసం పిచ్చోళ్లలా ఓట్ల కోసం ప్రజల వెంట పడుతున్నారు..
  • జనాలను పిచ్చోళ్లను చేసి తెలంగాణలో అధికారంలోకి వద్దామనుకుంటున్నారు..

పిచ్చోడికి ప్రపంచమంతా పిచ్చిగానే కనిపిస్తుందట. ఇప్పుడు కాంగ్రెస్ నేతల పరిస్థితి అలాగే తగలడింది. దశాబ్దాలు తెలంగాణను పాలించి తెలంగాణ ప్రజలను పిచ్చోళ్లను చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణలో అధికారం లేకపోయేసరికి పిచ్చోళ్లు అవుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిలా పాలన జరిగింది వాళ్ల హయాంలోనే కదా. పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న చందంగా వాళ్లకు అందరూ పిచ్చోళ్లలాగానే కనిపిస్తారు. అందుకే షబ్బీర్ అలీ తెలంగాణలో పిచ్చోడి చేతిలో రాయిలా పాలన జరుగుతున్నందటూ ఆరోపిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు.

ఒకసారి గతంలోకి వెళ్తే మీకే అర్థమవుతుంది కదా షబ్బీర్.. తెలంగాణను ఎవరు దోచుకుతిన్నారో? తెలంగాణను నాశనం చేసి.. మీ కడుపు నింపుకొని ఇప్పుడు శుద్ధపూసల్లాగా మాట్లాడుతున్నారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు తెలంగాణను పట్టించుకున్నవా? మీ పార్టీ పట్టించుకున్నదా? ఇప్పుడు తెలంగాణపై ప్రేమ ఉన్నట్లు కపట ప్రేమను నటిస్తున్నారు. ఏ ఉద్దేశంతో ఇప్పుడు మీరు తెలంగాణపై కపట ప్రేమ కనబరుస్తున్నారో తెలంగాణ సమాజానికి తెలుసు.

ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంట ఉండేసరికి కాంగ్రెస్ నేతలకు కండ్లు కుడుతున్నాయి. ఓర్వలేకపోతున్నారు. ఎలాగైనా తెలంగాణ ప్రజలను టీఆర్ఎస్ పార్టీకి దూరం చేయాలన్న దురుద్దేశంతోనే ఇలా తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లుతూ తెలంగాణ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తున్నారు. ఇలాంటి తెలంగాణ ద్రోహులను తెలంగాణ నుంచి తరిమేస్తేనే తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది.

Top