You are here
Home > Uncategorized > షర్మిలా.. మీరు ఇక్కడి మహిళ అయి ఉంటే వాస్తవాలు బోధపడేవి..!

షర్మిలా.. మీరు ఇక్కడి మహిళ అయి ఉంటే వాస్తవాలు బోధపడేవి..!

Spread the love

 

షర్మిలా.. మీరు ఇక్కడి మహిళ అయి ఉంటే వాస్తవాలు బోధపడేవి..!

– ఇలాంటి వెటకారమే… ఇలాంటి అహంభావమే వద్దనేది

– రాజకీయాలు చేసుకుంటానంటే చేసుకో.. అహంకారం మానుకో

– కేసీఆర్ సర్కారు చేసిన మంచిని మహిళలను అడుగు.. వాస్తవం తెలుస్తుంది

తెలంగాణకు వీలైనంత వరకూ అన్యాయం చేసిన చరిత్ర వైఎస్ రాజశేఖరరెడ్డిది. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన గొంతు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ది. ఇలాంటి తెలంగాణ వ్యతిరేకులు ఉన్న ఇంట పుట్టిన షర్మిల.. తాను తెలంగాణ బిడ్డే అన్నట్టు వింత వింతగా.. రకరకాలుగా హావభావాలు ప్రదర్శిస్తున్నారు. రాజకీయాల్లో ప్రస్తుతం కామెడీకి ఉన్న స్పేస్ ను వాడుకుని.. పర్ఫార్మెన్స్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నారు. కామెడీ పొలిటికల్ స్టార్ లేని లోటు జనానికి తీరుస్తున్నరు.

కేటీఆర్ ఎవరు.. అని అమాయకంగా అడుగుతున్న షర్మిల మొహంలో.. రాజకీయ చతురత కాదు.. తెలంగాణపై వ్యతిరేకతే స్పష్టంగా వ్యక్తమవుతోంది. ఉద్యమంలో ముందు నిలిచి.. ఇప్పుడు మంత్రిగా రాష్ట్రానికి అంతర్జాతీయ సంస్థలు సైతం రప్పించిన ఘన చరిత్ర ఉన్న కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలతో.. ఆమెలోని అహంభావం, అవసరం లేని అతి విశ్వాసం బయటపడ్డాయి. తనలోని తెలంగాణ వ్యతిరేక భావజాలతీరును తానే బయటపెట్టుకునేలా చేశాయి.

పైగా.. మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అనేందుకు.. అసలు ఎంత ధైర్యం ఉండాలి షర్మిలకు? కేసీఆర్ కిట్ దగ్గరనుంచి మొదలుపెడితే.. ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే వరకూ.. తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకూ కేసీఆర్ ఒక అన్నగా.. తండ్రిగా.. బాధ్యతగా తోడు నిలుస్తున్నారు. భద్రత విషయంలో పెద్ద పీట వేస్తూ.. వీలైనంతవరకూ దారుణాలు జరగకుండా పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి చర్య ఒక్కటైనా చేసిందా? అలాంటి రాజన్న రాజ్యాన్ని తెలంగాణకు తీసుకురావడం వెనక ఉద్దేశం ఈ కుట్రలేనా? కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలతో.. మీడియాలో చోటు కోసమే షర్మిల ఆరాటమా? ఇదే నిజమైతే.. కాస్త పొలిటికల్ కామెడీ చేసేందుకు తప్ప.. ఇలాంటి చిల్లర చేష్టలు రాజకీయాల్లో ఎదిగేందుకు ఎందుకూ ఉపయోగపడవని అర్థం చేసుకో షర్మిలా. విమర్శలకు ముందు ఆలోచించుకో.

ఇక్కడి మహిళ అయి ఉంటే వాస్తవాలు తెలిసేది. ఇక్కడి మహిళలతో మాట్లాడితే తెలిసేది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సంక్షేమం ఎంతటి ఉన్నతంగా ఉందో. అలాంటి ప్రయత్నం చేయని షర్మిలకు..  రాజకీయాల్లో ఉండే అర్హత లేదని యావత్ తెలంగాణ ప్రజానీకం తేల్చి చెబుతోంది. విమర్శలకు ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తోంది.

Top