You are here
Home > Uncategorized > ముస్లింలకు నీ అన్న ఏం రిజర్వేషన్ ఇస్తుండు.

ముస్లింలకు నీ అన్న ఏం రిజర్వేషన్ ఇస్తుండు.

Spread the love

ముస్లింలకు నీ అన్న ఏం రిజర్వేషన్ ఇస్తుండు.

  • షర్మిల ముందు దీనికి సమాధానం చెప్పి.. ఆ తర్వాత…
  • తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్ మీద మాట్లాడు.
  • అసలు తెలంగాణలో నీ బోడి పార్టీ ఎవరు కావాలన్నాడు.
  • ఎందుకు సమ్మేళనాలు పెడుతున్నవ్.

బీజేపీ వాళ్లతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నవా?.
తెలంగాణ వద్దంటే వద్దని వ్యతిరేకించి.. ఏపీలో నిరసనల్లో పాల్గొని.. హైదరాబాద్ కు పోవాలంటే వీసాలు తీసుకుని పోవాల్నా అని శుద్ధపూస మాటలు మాట్లాడిన షర్మిల.. ఇవాళ అదే తెలంగాణ గడ్డపై పార్టీ ఎందుకు పెడతానంటోంది. ఆత్మీయ సమ్మేళనాలు అంటూ ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తోంది.. తెలంగాణ ప్రభుత్వం అని పలికే అర్హత కూడా నీకు లేదు. సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు.. మోసం చేశారని విమర్శిస్తావా?. అసలు నీ బోడి పార్టీ కావాలని ఎవరు అడిగిండు. సెటిలర్స్ ను, క్రిస్టియన్స్ ను తీసుకొచ్చి మీటింగులు పెడుతూ.. ఏదో తెలంగాణ ప్రజలంతా నువ్వు కావాలని కోరుకుంటున్నట్లు బిల్డప్ ఇస్తున్నవ్.

చేతనైతే మీ అన్నతో కొట్లాడు.. అక్కడ చేతకాదని వచ్చి తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తే.. ఇక్కడి ప్రజలు ఎవ్వరూ అంత సిగ్గు తప్పి లేరు. నువ్వు ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి కొందరు నీ పక్కన చేరొచ్చు. కానీ నిజమైన తెలంగాణ బిడ్డ ఎవ్వరూ దేహి అంటూ నీ దగ్గరకు రాడు. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయలేదని చిలక పలుకులు పలుకుతున్నవ్.. నీ తోడబుట్టిన అన్న ఏపీలో సీఎం కదా.. నువ్వు పుట్టిన నేలపై ముస్లింలకు ప్రత్యేకంగా ఏమైనా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయా?. ముందు నీ అన్నని ప్రశ్నించి.. ఆ తర్వాత మా గురించి మాట్లాడు. మా దగ్గర 12శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి కూడా పంపడం జరిగింది.

అసలు నువ్ ఎవరు పంపిన దూతవు. క్రిస్టియన్లు, ముస్లింలను మాత్రమే ఎందుకు పిలిచి మీటింగులు పెడుతున్నవ్. ఎవరి ఓట్లు చీల్చాలని.. ఎవరికి లబ్ది చేకూర్చాలని రాజకీయ పార్టీ అంటున్నవ్. అసలు నీ వెనక ఎవరున్నారు?. నీకు సంబంధం లేని రాష్ట్రంలో పార్టీ పెట్టేందుకు ఎవరు ప్రోత్సహిస్తున్నారు. కాషాయానికి పడని ఓట్లను టీఆర్ఎస్ కు పడకుండా చేయాలనే నీ రాజకీయ ఉద్దేశం. అందుకే బీజేపీ అండ చూసుకుని ఇక్కడ పార్టీ పెట్టాలని చూస్తున్నవ్. అంతేకదా?. అందుకే క్రిస్టియన్లు, ముస్లింలను టార్గెట్ చేశావ్.

Top