You are here
Home > Latest News > శిలాఫలకం మీద పేరు లేకుండా చేసిందెవరో.. తేలాల్సిందే..!

శిలాఫలకం మీద పేరు లేకుండా చేసిందెవరో.. తేలాల్సిందే..!

Spread the love

 

శిలాఫలకం మీద పేరు లేకుండా చేసిందెవరో.. తేలాల్సిందే..!

– జ్వరాన్ని కూడా రాజకీయం చేస్తారా.. ఛీ..!
– రాజకీయం కోసం చిల్లర మాటలు వద్దంటున్న జనాలు
– శిలాఫలకం మీద పేరు లేకుండా చేసిందెవరో తేల్చాల్సిందేనని డిమాండ్

హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకకు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యద్భుత సహకారం అందుతోంది. అధికారుల స్థాయిలో.. పోలీసుల స్థాయిలో.. అన్ని విభాగాల నుంచి.. కార్యక్రమం విజయవంతం అయ్యేలా అండదండలు అందుతున్నాయి. అయినా.. కొందరు రాజకీయాలతో చిల్లర బుద్ధి చూపించుకుంటున్నారు.

ప్రధాని వస్తే.. స్వాగతించేందుకైనా ముఖ్యమంత్రి రాలేకపోయారా.. అంటూ బీజేపీ నేతలు చిల్లర కూతలు కూస్తున్నారు. జ్వరాన్ని కూడా రాజకీయం చేసేంతగా వాళ్లు దిగజారుతున్నారు. ఇదంతా చూసి.. రాజకీయం కోసం చిల్లర మాటలు వద్దని బీజేపీ నేతలకు జనం బుద్ధి చెబుతున్నారు. అసలు.. రామానుజాచార్య విగ్రహాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమ శిలాఫలకంపై సీఎం కేసీఆర్ ఫొటో ఎందుకు లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

చిన్న జీయర్ స్వామి రాజకీయాలు చేయరు. ఆశ్రమానికి స్థలాన్ని అందించి.. రామానుజ సహస్రాబ్ది సమారోహాన్ని విజయవంతం చేసిన మై హోమ్స్ సంస్థల అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావుకు.. కేసీఆర్ పై రాజకీయం చేయాల్సిన అవసరమే లేదు. మిగిలిందంతా.. కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రమే. అలాంటప్పుడు కేసీఆర్ కు మాట పడాల్సిన అవసరమేంటన్నదే జనాల ప్రశ్న.

తాను రాలేని అత్యవసర పరిస్థితుల్లో.. మంత్రిని పంపించి మరీ ప్రధానికి స్వాగతం చెప్పించారు కేసీఆర్. అంతటి సుహృద్భావాన్ని పంచిన కేసీఆర్ పేరును.. రామానుజ విగ్రహాన్ని లోకానికి అంకితం చేసే క్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఎందుకు లేకుండా చేశారు.. ఎవరు ఆ పని చేశారన్నది ప్రశ్నార్థకంగా మిగిలిందని జనం అంటున్నారు. ఈ విషయంలో స్పష్టత వచ్చాకే కేసీఆర్ గురించి బీజేపీ నేతలు మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు.

Top