You are here
Home > National News > చెబితే వినరా.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ వస్తేనా మారతారా?

చెబితే వినరా.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ వస్తేనా మారతారా?

Spread the love

చెబితే వినరా.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్ వస్తేనా మారతారా?

  • మన కోసం.. మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు
  • కరోనాను పారదోలేందుకు చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు
  • ప్రజలారా సహకరించండి.. ప్రాణాలు కాపాడుకోండి.. తోటి వారి ప్రాణాలు కాపాడండి

కరోనా విస్తరిస్తోంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజలు.. బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వానికి సహకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపైకి రావొద్దని మంచి కోరి చెబితే.. పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ చెడును తెలంగాణకు ఎదురుతెస్తున్నారు. అందుకే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కర్ఫ్యూ విధించారు.

సాయంత్రం నుంచి తెల్లారి వరకూ ప్రతి రోజూ కర్ఫ్యూ ఉంటుందని సీఎం తెలిపారు. ఎవరూ రోడ్లపైకి రానే రావొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆర్మీని దింపాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా లాంటి దేశంలోనే ఆర్మీని రంగంలోకి దించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 7 లోగా కరోనా బాధితులు కోలుకునేలా ప్రణాళిక అమలు చేస్తున్నట్టు చెప్పారు.

ప్రజలు సహకరించకుంటే.. ఆఖరి దశలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్లు కూడా ఇవ్వాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేసినట్టే.. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని తేల్చి చెప్పారు. ఇది ప్రజల కోసం ప్రభుత్వం ధైర్యవంతంగా తీసుకున్న నిర్ణయం కాబట్టి.. అంతా తప్పకుండా సహకరించాల్సిందే. లేదంటే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందే.

ప్రజలారా.. మేల్కొనండి. బాధ్యతా మెలగండి. మిమ్మల్ని మీరు కాపాడుకోంది. వైద్యరంగం, పోలీసులు, మీడియా వంటి రంగాలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటే.. మనల్ని ఎవరూ కాపాడలేరు. అతి భయంకరమైన అపాయాలు ఎదురవుతాయి. అందుకే.. స్వీయ నియంత్రణ పాటించండి. ఎవరిని వారు కాపాడుకోండి. తోటి వారిని కాపాడండి. తెలంగాణను క్షేమంగా ఉంచండి. దేశాన్ని భద్రంగా ఉండేలా చూడండి. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన బాటలో నడవండి.

Top