You are here
Home > Latest News >  మీ బండారం బయటపడలేదని బాధపడుతున్నావా శ్రవణ్?

 మీ బండారం బయటపడలేదని బాధపడుతున్నావా శ్రవణ్?

Spread the love

కాగ్ నివేదిక అంటే అసలు అవగాహన ఉందో లేదో.. మన కాంగ్రెస్ నేతలకు. ఎందుకంటే.. గతంలో వారి పరిపాలన నడుస్తున్నపుడు కూడా.. కాగ్ నివేదిక ఇచ్చింది. నిధుల కేటాయింపులో కొన్ని విషయాలను ప్రస్తావించింది. అంతే కానీ.. అవినీతి జరిగిందని కానీ.. ఇంకేదో జరిగిపోయిందని కానీ.. ఎన్నడూ చెప్పలేదు. అలా కాగ్ చెప్పదు కూడా. ఆ మాత్రం దానికి.. కాంగ్రెస్ నేతలు చిలువలు పలువలు చేసి.. అప్పులను కూడా ఆదాయంగా చూపెట్టారని అనవసర ఆరోపణలు చేస్తూ.. జనంలో ప్రభుత్వాన్ని దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది.

ఈ ప్రయత్నంలో.. కాంగ్రెస్ నేతలే దోషులుగా మిగులుతున్నారు. అనవసర రాద్ధాంతం చేస్తూ.. కేసీఆర్ సర్కార్ బండారాన్ని కాగ్ బయటపెట్టిందని అంటున్న దాసోజు శ్రవణ్ లాంటి నేతలు.. ప్రజాస్వామ్య నేరస్థుల్లా మారిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలను నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదంటున్న దాసోజు శ్రవణ్.. ఒకప్పుడు తెలంగాణకు పైసా కూడా ఇచ్చేది లేదని బహిరంగంగా చెప్పిన కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డిని ఏమనాలి? అడుగడుగునా తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్ నేతలను ఏమనాలో కూడా చెబితే జనాలు సంతోషిస్తారు.

అలా కాకుండా.. ప్రభుత్వాన్ని విమర్శించినా.. నీతి ఆయోగ్ కు ఫిర్యాదు చేస్తామని.. అది చేస్తామని.. ఇది చేస్తామని అవాకులు చెవాకులు పేలినా.. జనం మాత్రం చూస్తూ ఊరుకోరు. ఇంతకింతా.. కాంగ్రెస్ నేతలకు బదులు చెప్తారు.

Top