You are here
Home > Uncategorized > సిద్ధిపేట సిగలో.. మరిన్ని వెలుగులు! – మాట తప్పని.. మడమ తిప్పని ముఖ్యమంత్రి కేసీఆర్

సిద్ధిపేట సిగలో.. మరిన్ని వెలుగులు! – మాట తప్పని.. మడమ తిప్పని ముఖ్యమంత్రి కేసీఆర్

Spread the love

సిద్ధిపేట సిగలో.. మరిన్ని వెలుగులు!

– మాట తప్పని.. మడమ తిప్పని ముఖ్యమంత్రి కేసీఆర్

– సిద్ధిపేట వేదికగా పాలనలోనవశకానికి నాంది పలికిన సీఎం

– సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ప్రారంభం

ఒకనాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న సిద్ధిపేట.. ఇప్పుడు అభివృద్ధి ప్రకాశికగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో మార్గదర్శిగా.. అభివృద్ధికి దిక్సూచిగా.. మోడల్ నియోజకవర్గంగా ఎదుగుతూ.. రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. తాజాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ.. సిద్ధిపేట సిగలో మరిన్ని వెలుగులు చేర్చి ప్రజలకు ఆనందాన్ని పంచుతోంది. అభివృద్ధి మరో అడుగు ముందుకు వేసి.. తెలంగాణకు గర్వకారణమవుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ భవనం.. యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. ఏకంగా.. 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో.. ప్రభుత్వ సేవలు సమస్తం అందేలా.. ఈ భవనాన్ని నిర్మించారు. జిల్లాలోని ప్రజలందరికీ ఎలాంటి సేవ కావాలన్నా.. సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా ఈ సమీకృత భవనానికి వెళ్తే సరిపోయేలా ఇక్కడ ప్రణాళిక అమలు చేస్తూ.. ప్రజలకు పాలనను మరింత చేరువ చేస్తున్నారు.

అంతకు ముందు.. మన ముఖ్యమంత్రి కేసీఆర్.. సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, రాంపల్లిలో సిద్ధిపేట పోలీస్ కమిషనరేటను సైతం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. నియోజకవర్గ పాలనకు, శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్రంగా ఉండే ఈ కార్యాలయాలను సువిశాల ప్రాంగణంలో.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించారు. ప్రజలకు ఎమ్మెల్యే అనుక్షణం అందుబాటులో ఉండేలా.. ఇక్కడి నుంచి కార్యాచరణ అమలు చేయనున్నారు.

ఇంతేనా.. మన సీఎం.. ఏం చేసినా అంతకుమించి అన్నట్టుగా పరిపాలన ఉంటుంది. అందుకు తగ్గట్టే.. తన దయాహృదయతను ప్రదర్శిస్తూ.. సిద్ధిపేట పర్యటనలో మంచి మనసు చాటుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో.. తనను కలిసేందుకు వెళ్లిన కొందరి సమస్యలను సావధానంగా విన్నారు. వీలైనంగా.. వాటిని పరిష్కరించాలని తక్షణ ఆదేశాలిచ్చి..  తను దీన జన బాంధవుడని కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నారు.

అందుకే.. కేసీఆర్ పర్యటనకు సిద్ధిపేట జనం.. నీరాజనం పలికారు. మనసా వాచా కర్మణా ఆశీర్వదించారు. కేసీఆర్ నాయకత్వంలోనే.. మరింత అభివృద్ధి సాధ్యమన్న విశ్వాసాన్ని.. ఆయనకే తమ శాశ్వత మద్దతు అని.. బలమైన వ్యక్తీకరణ చేశారు. టీఆర్ఎస్ వెంటే నడుస్తామని.. కేసీఆర్ తమ నాయకుడని స్పష్టీకరించారు.

Top