You are here
Home > Telangana > పరిస్థితి మారుతోంది.. తెలంగాణ ప్రభుత్వ ఘనత ఇది!

పరిస్థితి మారుతోంది.. తెలంగాణ ప్రభుత్వ ఘనత ఇది!

Spread the love

 

పరిస్థితి మారుతోంది.. తెలంగాణ ప్రభుత్వ ఘనత ఇది!

  1. కరోనా విస్తృతి విషయంలో స్పష్టమైన మార్పు
  2. ఆదివారం నాడు కేవలం రెండే కేసులు పాజిటివ్
  3. గతంలో పాజిటివ్ గా ఉన్న 11 కేసులకు ఇప్పుడు నెగటివ్

పరిస్థితి మారుతోంది. స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కరోనాను జయించడంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పని తీరు.. అద్భుతమైన సత్ఫలితాన్ని సాధించే సంకేతాలు కదలాడుతున్నాయి. నిన్నటివరకూ పెరుగుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసుల నమోదుకు.. ఆదివారం బ్రేకులు పడ్డాయి. కేవలం 2 మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవడం.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఫలితంగా సంకేతాలు పంపిస్తున్నాయి.

ఇప్పటికే కరోనా బాధితులుగా మారిన 11 మందికి.. ఆదివారం నాడు చేసిన పరీక్షల్లో నెగటివ్ ఫలితాలు రావడం.. వారు పూర్తిగా కోలుకుంటున్నారని తెలిపేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం.. యావత్ తెలంగాణను సంతోషంలో మునిగేలా చేసింది. అంతే కాదు.. గత మూడు రోజుల సరళిని పరిశీలిస్తే.. శుక్రవారం నాడు ఏకంగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

శనివారానికి వచ్చే సరికి వాటి సంఖ్య.. 9 గా నమోదైంది. అదే.. ఆదివారం చూస్తే 2కు పరిమితమైంది. మొత్తంగా.. ప్రస్తుతం 54 మంది కరోనా పాజిటివ్ రోగులు.. ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయాలు వెల్లడించిన మన జననేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా ప్రభావం తగ్గుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేవుడి దయ ఉంటే.. వచ్చే నెలలో పరిస్థితులు కుదుటపడతాయని చెప్పారు.

కానీ.. ఇంతటి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నా కూడా.. ఆయన ఏ మాత్రం అలసత్వాన్ని ప్రదర్శించలేదు. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని.. పోలీసులను పెట్టి మరీ క్వారంటైన్ కు పరిమితం చేశామని చెప్పారు. దశల వారీగా.. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలిశాకే.. రోడ్లపైకి వదులుతామన్నారు. అలాగే.. రాష్ట్రంలోనూ ప్రజల క్షేమం కాపాడుకోవాలి కాబట్టి.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ప్రజలు మరింత సహకరిస్తే కరోనాను త్వరగా పారదోలవచ్చని చెప్పారు.

కాబట్టి ప్రజలారా.. ఇంతటి క్లిష్ట సమయంలో.. ఇంత మంచి ఫలితాలు సాధిస్తున్న ప్రభుత్వం మనది మాత్రమే అని గుర్తించండి. కేసీఆర్ అడుగుజాడల్లో నడవండి. ఆయన చెప్పిన మార్గదర్శకాలు పాటించండి. కరోనా రహిత తెలంగాణ సాధనలో భాగం కండి.

Top