You are here
Home > Uncategorized > సుర‌వ‌రం సుధాక‌ర రెడ్డి అడ్డంగా వాదించకు …

సుర‌వ‌రం సుధాక‌ర రెడ్డి అడ్డంగా వాదించకు …

Spread the love

స‌హ‌ చట్ట స‌వ‌ర‌ణకు తెరాస ఎందుకు మ‌ద్ద‌తు ఇచ్చింది ?

 

పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోందనే విమ‌ర్శ‌లు ఉన్న మాట నిజం. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగక‌ర‌మ‌ని, దీనికి తెరాస మ‌ద్ద‌తు ఇవ్వ‌డం స‌రికాద‌ని సీపీఐ నాయ‌కుడు సుర‌వ‌రం సుధాక‌ర రెడ్డి వాదించారు. ఈ విమ‌ర్శ‌ల్లో నిజ‌మెంతో చూద్దాం. స‌హ చ‌ట్టం చాలా సంద‌ర్భాల్లో దుర్వినియోగం అయిన మాట నిజం.

స‌హ చ‌ట్టం ఉద్య‌మ‌కారుల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కొంద‌రు ఇబ్బందిపెడుతున్నారు. ప్ర‌భుత్వ అధికారుల‌ను స‌తాయించ‌డానికీ దీనిని ఆయుధంగా వాడుకుంటున్నారు. కొంద‌రు బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి ఎదిగారు. అందుకే ఈ చ‌ట్టాన్ని స‌వ‌రించాల‌నే డిమాండ్లు పెరిగిపోయాయ్‌. అందుకే ఈ బిల్లుకు తెరాస మ‌ద్దతు ఇచ్చింది. ఈ విష‌య‌మై కేంద్రం ముందే తెరాస స‌హా అన్ని పార్టీల‌కు వివ‌ర‌ణ ఇచ్చింది. సమాచార హక్కు వ్యవస్థ స్వతంత్రను తాము దెబ్బతీయడం లేదని , తాము ఈ చట్టానికి సాధారణ సవరణ మాత్రమే తీసుకువచ్చామని తెలిపింది.

తాము ఏ విషయాన్ని దాచాలని అనుకోవడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. తమ ప్రభుత్వం తీసుకుంటున్న క్రియాశీల చర్యల వల్ల పౌరులు సమాచార హక్కు చట్టం కింద ఎక్కువ అప్పీళ్లను ఫైల్‌ చేస్తున్నారని చెప్పింది. 2014 యూపీఏ హయాంలో ఏడాదికి రెండులక్షల అప్పీళ్లు వస్తే, ఇప్పుడు ఏడాదికి 16 లక్షల అప్పీళ్లు వస్తున్నాయి. నిజానికి సమాచార హక్కు చట్టానికి బీజం పడింది 2002 ఎన్‌డిఎ హయాంలోనేన‌నే విష‌యాన్ని సుర‌వ‌రం గుర్తుంచుకోవాలి. ఆర్‌టిఐ వ్యవస్థ స్వతంత్రకు విఘాతం కలగకుండా సవరణ తీసుకురావ‌డం వ‌ల్లే తెరాస గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

Top