
తరుణ్ చుగ్వి తలకాయ లేని మాటలు
కేసీఆర్ అవినీతి చేస్తే ఊర్కోవాలని ఎవరన్నారు ?
ఆయనపై కేసులు పెట్టకుండా ఎవరాపుతున్నారు
కేసీఆర్ అవినీతి చేశారు. ఆయన చరిత్రను తవ్వితీస్తం. జైలుకు పంపిస్తం. బీజేపీ నాయకులు రోజుకు కనీసం ఒక్కసారి అయినా ఈ మూడు మాటలు చెప్పనిదే నిద్రపోరు. ఈ మాటలు వాళ్ల నాలుకల మీదే తిరుగుతుంటాయి. మైక్ కనిపించగానే కేసీఆర్ అవినీతి చేశాడు అని అరుస్తారు. ఢిల్లీ నుంచి వచ్చే బుడ్డర్ఖాన్ తరుణ్ చుగ్ కూడా ఇదే పాత డైలాగ్‌ను నిన్న వదిలాడు. కేసీఆర్ అవినీతి చేశాడు. జైలుకు పంపిస్తాం అంటూ తొడగొట్టారు. బాబూ ఛుగ్గూ.. కేసీఆర్ సీఎం అయి ఎనిమిదేళ్లు దాటింది. మొదటి ఏడాది నుంచే అవినీతి అవినీతి అంటూ లొల్లిలొల్లి చేస్తున్నారు. ఈ ఎనిమిదేళ్లలో ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ చూపలేకపోయారు. ఒక్క కేసూ పెట్టలేకపోయారు. ఆయన తప్పు చేసి ఉంటే మీ ఈడీ, ఐటీ, సీవీసీలు దాడులు చేయకుండా ఊర్కునేవి కావు. వేట కుక్కల్లా వేటాడేవి. ఆయన ఎక్కడా దొరుకుతారా.. అంటూ వెయ్యి కళ్లతో నిఘా వేశాయి. నిజంగా కేసీఆర్ అవినీతిపరుడు అయితే.. తెలంగాణకు రూ.3.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి ఉండేవే కావు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో ఆఫీసులు పెట్టి ఉండేవి కావు. మిషన్ భగీరథ పూర్తయ్యేది కాదు. కాంట్రాక్టర్లు పీచే ముఢ్ అనేవారు. మరిన్ని కంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయంటే కారణం ఇక్కడ అవినీతి అతి తక్కువగా ఉండటమే కారణం. చోటామోటా ఉద్యోగులు ఎవరన్నా లంచం తీసుకోవచ్చేమో కానీ.. రాజకీయ అవినీతి మాత్రం లేనేలేదు. అది ఉంటే జాబ్స్ వచ్చేవి కావు.. పెట్టుబడులు వచ్చేవి కావు. రాష్ట్ర సంపద పెరిగేవి కావు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు లేవు. జాబ్స్ లేవు. కొత్త కంపెనీలు లేవు. అవినీతి ఉంది కాబట్టి ఆ రాష్ట్రాలనూ ఎవడూ పట్టించుకోవడం లేదు. అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలి. మీరే ఢిల్లీలో అధికారంలో ఉంటూ కేసీఆర్ అవినీతి చేశాడని ఆరోపించడం మూర్ఖత్వం. సీబీఐ, ఎన్ఏఐ, ఈడీలను చేతిలో పెట్టుకొని కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన ఏ తప్పూ చేయలేదు కాబట్టి. తరుణ్ చుగ్ చేసిన రెండో ఆరోపణ ఏమిటి… అంటే కేసీఆర్‌కు రాజ్యాంగంపై నమ్మకం లేదట. దళితుల కోసం ఏకంగా రూ.10 లక్షల చొప్పున ఇస్తున్న వ్యక్తికి రాజ్యాంగంపై విశ్వాసం లేదని అనగలమా ? అంబేద్కర్‌ను ఎంతో గౌరవించే నాయకుడిపై ఇలాంటి విమర్శలు అర్థరహితం. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కాదు.. రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, నిధులు వచ్చేలా దానిని తిరగరాయాలని మాత్రమే అన్నారు. ఆయన చేసిన డిమాండ్ కొత్తదేమీ కాదు. గతంలో ఈ మాటను చాలా మంది అన్నారు.