You are here
Home > Uncategorized > చిన్నవాటికి భూతద్ధమా??.

చిన్నవాటికి భూతద్ధమా??.

Spread the love

 

  • 58 లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాల్లో 99.6శాతం కరెక్ట్.
  • కేవలం 0.4శాతమే పట్టా పుస్తకాల్లో మిస్టేక్స్.
  • తప్పులను సరిచేసే పనిలో ప్రభుత్వం.
  • ప్రతీ మండలానికి ఒక ప్రత్యేక టీమ్ వెను వెంటనే సమస్యలు పరిష్కారం.

భూ రికార్డుల ప్రక్షాళన అన్నది సవాల్ తో కూడిన అంశం. ఎందుకంటే 147 కోట్ల ఎకరాల భూమి లెక్కలు సరిచేయాలంటే.. తక్కువలో తక్కువ ఏడాది సమయం అయినా పడుతుంది. కానీ తెలంగాణ రెవెన్యూ యంత్రాంగం రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లోనే భూ రికార్డుల నవీకరణ చేసి.. యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. 147 కోట్ల ఎకరాల భూమిలో కేవలం 40వేల ఎకరాల వరకే చిన్నచిన్న తప్పులు దొర్లాయి. దీనికి పెద్ద రాద్దాంతం చేయడం ఎందుకు?. 99.6శాతం సక్సెస్ అన్నది పక్కన పెట్టి.. కేవలం 0.4 శాత మిస్టేక్స్ ఎత్తి చూపడం కరెక్ట్ కాదు.

ఎవరెన్ని విమర్శలు చేసినా భూ రికార్డుల ప్రక్షాళన అనేది పక్కాగా జరిగింది. ఒక్కో రెవెన్యూ టీం ఒకరోజు రెండు, మూడు గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేయడం జరిగింది. ఈ సమయంలో కొందరు భూ యజమానులు అందుబాటులో లేకపోవడంతో.. పాతలెక్కలు తీసి వాటినే ఎక్కించుకోవడం జరిగింది. అయితే పాత రికార్డుల్లో తప్పులు ఉండటం.. ఇప్పుడు కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల్లో చిన్నచిన్న తప్పులు దొర్లేలా చేశాయి.

కానీ.. కొత్త పట్టాల్లో తప్పులను సరిచేసేందుకు ప్రభుత్వం వేగంగా స్పందించింది. వెను వెంటనే ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి తప్పులను సరిచేస్తోంది. ఆ వెంటనే కొత్త చెక్కులు ముద్రించి రైతుబంధు సాయం అందిస్తోంది. కానీ.. కొంచెమంతైనా ఓపిక లేకుండా ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు బ్యానర్ ఐటమ్స్ రాయడం బాధేస్తుంది. 58 లక్షల మంది రైతు కుటుంబాల్లో కేవలం 40వేల రైతులకే మిస్టేక్ జరిగింది. అంటే మిగతా 57లక్షల 60వేల మంది రైతులకు పక్కాగా లెక్కలందాయనేగా అర్థం. అతి తక్కువ వనరులు, అతి తక్కువ సమయంలో ఇన్ని లక్షల మంది రైతుల భూ వివరాలు సరిచేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. కానీ… ఆంధ్రజ్యోతి రాతలు చూసి, రైతులే సిగ్గుపడుతున్నారు

Top