You are here
Home > Latest News > తీన్మార్ మల్లన్న వేషాలపై బీజేపీ రెస్పాండ్ కావాలె!

తీన్మార్ మల్లన్న వేషాలపై బీజేపీ రెస్పాండ్ కావాలె!

Spread the love

 

తీన్మార్ మల్లన్న వేషాలపై బీజేపీ రెస్పాండ్ కావాలె!

అసలు అతని వైఖరిని సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో చెప్పాలె

ఒరేయ్​ నాయనలారా.. తీన్మార్ మల్లన్న అనేటోడు ఇండిపెండెంట్ జర్నలిస్టు కాదురా.. బీజేపీ పెయిడ్​ ఆర్టిస్టు! అని తెరాస నాయకులు నెత్తీనోరూ కొట్టుకొని చెప్పినా చాలా మంది వినలేదు. తెలంగాణ బాగు కోసమే రోజూ కష్టపడి కేసీఆర్​, కేటీఆర్​లను తిడుతున్నరు అని కొందరు మేధావులు నమ్మారు. ఈయన వెనుక సంజయ్​, అర్వింద్​, వివేక్​ ఉన్నడు రా అంటే.. ‘చీ.. అంతా అబద్ధం’ అని కొట్టిపారేశారు. చివరికి మన చింతపండు బీజేపీలో చేరాక అసలు సంగతి అందరికీ అర్థమైంది. చింతపండు గతంలో చేసిన తప్పులన్నీ ఒక ఎత్తయితే నిన్న చేసిన తప్పు మరీ పెద్దది. కేటీఆర్​ కొడుకు పర్సనాలిటీని అవమానిస్తూ బాడీ షేమింగ్​ చేశాడు.

వంగలేక మంగళవారం అన్నట్టు.. పాలనలో లోపాలు బయటపెట్టలేక కేటీఆర్​ను కొడుకును తిట్టడం ద్వారా నోటిదూల తీర్చుకున్నాడు. ఒక టీనేజర్​ బాడీసైజు పెరుగుతుందంటూ కామెంట్​ చేయడం అత్యంత నీచమైన పని. విదేశాల్లో అయితే ఈపాటికి చింతపండు పని అయిపోయేది.  మళ్లీ చిప్పకూడు తింటూ ఉండేవాడు. కేటీఆర్​ కొడుకు హిమాన్షు పసివాడు. అభంశుభం తెలియనివాడు. ఈ రాజకీయ రొచ్చు అంటే ఏంటో తెలియనివాడు. అలాంటి వాడిని తిట్టడం ఏం సంస్కారం ?

ఇలాంటి సిగ్గులేని పనిచేసిన చింతపండుపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి. ప్రభుత్వం ఇన్ని చెడ్డ పనులు చేస్తుంటే మన చింతపండు బీజేపీ నాయకుడి హోదాలో ఆ పార్టీ ఆఫీసులో ఎందుకు ప్రెస్​మీట్లు పెట్టడం లేదు ? ఆధారాలు ఎందుకు చూపడం లేదు ? కేటీఆర్​ తప్పు చేస్తే సీబీఐకో ఈడీకో ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు ? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. నిజం చెప్పాలంటే చింతపండును ఒక నాయకుడిగానే బీజేపీ చూడటం లేదు. కేసీఆర్​ కుటుంబాన్ని తిట్టే పని వీడిది. ఇందుకు నెలకు కొంత బిచ్చం వేస్తున్నారు.

ఆ ఎంగిలి కూడుకు ఆశపడి చింతపండు చెలరేగిపోతున్నాడు. అసలు తెరాస ఫిర్యాదు చేయాల్సింది చిల్లర చింతపండుపై కాదు.. వెనుక ఉండి ఇతణ్ని రెచ్చగొడుతున్న పువ్వు పార్టీ నాయకులపై! అప్పుడే అన్ని నిజాలూ బయటపడుతాయి. చింతపండు లాంటి చెత్తగాళ్లు చాలా మంది ఉన్నారు. వీరందరి వెనుక ఎవరున్నారో తేలాలె. కేసీఆర్​ ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకోవాలె.

Top