You are here
Home > Latest News > ఇంకో వంద సంవత్సరాలు అయినా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాదు కృష్ణ సాగర్

ఇంకో వంద సంవత్సరాలు అయినా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాదు కృష్ణ సాగర్

Spread the love
  • ఇంకో వంద సంవత్సరాలు అయినా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాదు కృష్ణ సాగర్
  • కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ఐదేళ్లు నిలబడుతుందా? లేదా?
  • తెలంగాణకు నయా పైసా ఇవ్వకున్నా.. మీకు అడిగే దమ్ములేదు
  • రాష్ట్ర ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు
  • మీరు లేనిపోనివి చెప్పి… అనవరసరమైన చికాకులు తెప్పిస్తున్నారు

తెలంగాణ రాష్ట్రం 2014 కు ముందు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది.. అని అడిగితే.. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. అది ఏమన్నా దాచుకునేదా? అందరికీ తెలిసిందే కదా. ఒకప్పుడు సాగునీటి కోసం తెలంగాణ రైతన్న ఎంత కష్టపడేవాడో అందరికీ తెలుసు. ఇప్పుడు రైతన్న పొలం దగ్గరికే సాగు నీరు పోతా ఉంది. ఇదంతా ఎవరి వల్ల జరిగింది. మంచి నీళ్లు కూడా ఇంటికే వస్తున్నాయి. ఎక్కడా నీటి కొరత లేదు. 24 గంటల కరెంట్ వస్తాఉంది. ఇవన్నీ ఎలా జరిగాయి. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ హయాంలో జరిగాయా? లేదు.. పోనీ… టీడీపీ హయాంలో జరిగాయా.. లేదు.

మరి.. ఎవరి హయాంలో జరిగాయి… సీఎం కేసీఆర్ హయాంలో జరిగాయి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక… టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక.. తెలంగాణ అభివృద్ధి ముందుకు కదిలింది. లేకపోతే.. తెలంగాణలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండేది.

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ తెలంగాణకు ఏం చేసిందో చెబుతారా కృష్ణ సాగర్. తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదు ఇప్పటి వరకు. రాజ్యాంగం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు తప్పించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం… కాళేశ్వరానికి నయాపైసా ఇవ్వలేదు. కనీసం జాతీయ హోదా కూడా ఇవ్వలేదు. వీటిపై ఏమనాలి మరి.

సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రజల సమస్యలనే తన సమస్యలుగా మీదేసుకొని.. తెలంగాణలో ఉన్న సమస్యలన్నింటినీ.. ఒక్కొక్కటిగా తీర్చుతూ వస్తున్నారు సీఎం కేసీఆర్. అయినప్పటికీ మీరు ఇలా మాట్లాడటం మాత్రం ఏవిధంగానూ కరెక్ట్ కాదు. ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఐదేళ్లు నిలబడుతుందో లేదో చూసుకోండి.

Top