You are here
Home > Latest News > ఈ ఏడు కూడా.. తెలంగాణే నంబర్ వన్!

ఈ ఏడు కూడా.. తెలంగాణే నంబర్ వన్!

Spread the love

సంక్షేమం అంటే మాటలు కాదు. పరిపాలన అంటే చెప్పినంత ఈజీ కాదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ఆ మాట మాట్లాడినంత సులువూ కాదు. కానీ.. ఈ అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు కాబట్టే.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధీ చెందుతోంది. రాష్ట్ర ప్రజల తలరాతలు మారుస్తోంది. అన్ని వర్గాలనూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్న రాష్ట్రంగా ఈ ఏడాది కూడా.. తెలంగాణకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది.

దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా.. ఏ ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు సాహసం చేయలేని విధంగా.. కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేస్తోంది. రేపటి నుంచే అంటే జనవరి 1 నుంచే రైతులకు ఉచితంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టి చరిత్ర సృష్టించింది …

అక్కడితోనే ఆగని సర్కారు.. వచ్చే పంట కాలం నుంచి.. రైతులకు ఎకరాకు 4 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించి.. సాగును బాగుగా మార్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోంది.

విద్యుత్ కొరతను తీర్చేందుకు సోలార్ విద్యుదుత్పత్తికి ప్రాధాన్యత ఇస్తూ.. 3 వేల 184 మెగావాట్ల విద్యుత్ ఉత్పిత్తితో దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.. కేసీఆర్ సర్కార్.

మిషన్ భగీరథ ఫలాలను మొదటి విడతగా అందించి.. వచ్చే ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డల కాళ్లను కృష్ణా, గోదావరి నీటితో కడిగేందుకు వడివడిగా చర్యలు తీసుకుంటోంది.

మిషన్ కాకతీయతో ఇప్పటికే వేలాది చెరువుల పూడిక తీయించిన సర్కారు.. ఇప్పుడు నాలుగో విడతకూ సిద్ధమైంది.

సబ్సిడీపై గొర్రెల పంపిణీలాంటి దేశంలోనే ఎక్కడాల లేని ఆదర్శకార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది.

దేశంలోనే బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తున్న ఒకే ఒక రాష్ట్రంగానూ.. తెలంగాణ ఖ్యాతి పొందింది.

కల్యాణలక్ష్మి, షాదీముబారఖ్ సహాయాన్ని 50 వేల నుంచి 75 వేలకు పెంచి.. దానిని ఇంకా పెంచుతూ 1,00,116 /- గా చేయబోతుంది  ఇన్ని మంచి పనులు చేసి మనసున్న ప్రభుత్వమని చాటుకుంది.

కేసీఆర్ కిట్ పథకాన్ని కూడా.. దేశంలో లేనంతగా మన దగ్గరే అమలు చేస్తూ.. గర్భవతులు, బాలింతలు, చంటిబిడ్డల క్షేమాన్ని.. ఇంటి పెద్దలా చూసుకుంటోంది.

ఇవి మాత్రమే కాదు. ఇంకా చెప్పనవి.. చెప్పినవి అని తేడా లేకుండా.. అన్ని రంగాల్లో జీతాల పెంపు.. వేల సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ.. నిరంతర కరెంటు సరఫరా.. రైతులకు విత్తనాల కొరత లేకుండా చేయడం.. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడం.. వాటిని విజయవంతంగా అమల్లోకి తీసుకురావడం.. గురుకులాల ప్రారంభం.. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం.. అగ్ర వర్ణాల పేదలకూ సంక్షేమం.. పథకాల అమలులో పారదర్శకత.. ఇలా రకరకాలుగా ఎటు చూసినా.. సంక్షేమ రంగంలో.. దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది. ఆదాయ సృష్టిలో తనకు తానే సాటి.. తనకెవరూ లేరు పోటీ అన్నంతగా ఉత్తరాది రాష్ట్రాలను మించి ఎదుగుదలను చూపిస్తోంది.

అందుకే.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ.. రాష్ట్రం ముందంజలో నిలిచి.. జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటోంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పెంచుకుంటోంది. ఇదంతా.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విజన్ తోనే సాధ్యమవుతోంది.

Top