
- విభజన హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని లోక్సభలో తెరాస ఎంపీలు ఆందోళన
- విభజన జరిగి మూడేళ్ల దాటినా హైకోర్టును కేంద్రం ఎందుకు విభజించడం లేదని ప్రశ్నించారు…
- ఇచ్చిన మాటను తప్పింది కేంద్ర ప్రభుత్వమని ప్లకార్డులతో ప్రదర్శన …
- మోడీ కుడా తెలంగాణకు ప్రత్యేక కోర్ట్ అవసరమని మాటను మర్శిండు …
- తక్షణమే హై కోర్ట్ విభజన చేయాలనీ డిమాండ్ చేసిన ఎంపీలు
- ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ఎన్నో సార్లు అడిగిన ఫలితం లేదు
- కేసీఆర్ గారు ఈ విషయమై మోడీ గారితో చాలా సార్లు మాట్లాడారు అయినా చర్యలు శూన్యం …
విభజన ప్రకటన వచ్చే దాకా ఆందోళన చేస్తాం :టీఆర్ఎస్ ఎంపీ కవిత
ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందని టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రశ్నించారు. లోక్సభ వాయిదా అనంతరం ఎంపీ కవిత మీడియాతో మాట్లాడారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలన్న కవిత.. ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. కేంద్రప్రభుత్వం చొరవ చూపి వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఏపీ స్థలం ఇవ్వలేదని, భవనాలు లేవని సాకులు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుపై నెపం నెట్టడం భావ్యం కాదన్నారు.
అటు మూడున్నరేళ్లు గడిచినా హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి. చట్టసభల వేదికగా ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన హామీలపై ఈ సమావేశాల్లో పోరాడుతామన్నారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయాలని మరో ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఉమ్మడి హైకోర్టు రెండు రాష్ట్రాలకు న్యాయం చేయలేకపోతుందన్నారు.
————-
తెలంగాణకు హైకోర్ట్ అత్యవసరం: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్

తెలంగాణకు వెంటనే హైకోర్ట్ ఏర్పాటు చేయాలని లోక్ సభలో టిఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ స్పందించారు. సమస్యను న్యాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన అన్ని రాష్ట్రాలకు హైకోర్టులు ఉన్నాయని, తెలంగాణకు కూడా హైకోర్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. టిఆర్ఎస్ సభ్యులు లేవనెత్తిన అంశం విలువైనదని, తెలంగాణకు హైకోర్ట్ ఏర్పాటు అత్యవసరం అన్నారు. టిఆర్ఎస్ సభ్యులు ఆందోళన విరమించాలని కేంద్రమంత్రి కోరారు.
కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో టిఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. దీంతో, డిప్యూటీ స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.
ప్రత్యేక హైకోర్ట్ ఇవ్వకపోతే రాబోవు కాలంలో తెలంగాణాలో భాజపాకు గడ్డు పరిస్థితులు నెలకొంటాయని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారు …