You are here
Home > Uncategorized > ఆమోదం పొందింది.. అమల్లోకి రావడమే మిగిలింది

ఆమోదం పొందింది.. అమల్లోకి రావడమే మిగిలింది

Spread the love

ఆమోదం పొందింది.. అమల్లోకి రావడమే మిగిలింది

అవినీతిని నిర్మూలించే దిశగా కీలక అడుగు

కొత్త రెవెన్యూ చట్ట బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం

బిల్ ఈజ్ పాస్డ్ అని సభాపతి చెప్పగానే సంబరపడిన ప్రజలు

ద బిల్ ఈజ్ పాస్డ్. రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్చేస్తూ.. పూర్తి పారదర్శక విధానాలు తీసుకువస్తూ.. విమర్శకులను సైతం మెప్పిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ బిల్లును.. శాసనసభ ఆమోదించింది. రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చ తర్వాత.. బిల్లుకు ఎలాంటి సవరణలు లేకుండానే.. ప్రతిపాదించిన బిల్లు ప్రతిపాదించినట్టుగానే ఆమోదం పొంది.. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు మరో దారి కల్పించింది.

తాజాగా ఆమోదం పొందిన బిల్లు చట్టంగా మారితే.. ఇకపై వీఆర్వో వ్యవస్థ రాష్ట్రంలో శాశ్వతంగా రద్దు అవుతుంది. అలాగే.. గతంలో ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ ఒకసారి.. మ్యూటేషన్ మరోసారి కాకుండా.. రెండు ప్రక్రియలు ఒకేసారి పూర్తయ్యే అవకాశం ప్రజలకు లభిస్తుంది. ధరణి పోర్టల్ ద్వారా.. ఇకపై రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగనున్నాయి. ఈ చట్టం ప్రకారం.. వ్యవసాయ భూములను ఎమ్మార్వోలే రిజిస్టర్ చేస్తారు.

ఇన్ని సౌలభ్యాలు తీసుకురావడం.. వ్యవస్థలో దశాబ్దాలుగా వేళ్లూనుకుని ఉన్న అవినీతిని తరిమేసే చట్టం తేవడం.. కేసీఆర్ కు తప్ప మరో నేత సీఎంగా ఉండి ఉంటే సాధ్యం కాకపోయేదన్న మాట.. ప్రజల నుంచి వినిపిస్తోంది. చెప్పింది చేసే వ్యక్తిత్వం కాబట్టే.. ఈ చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేసీఆర్ శ్రమించారని ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి విధానాలే కదా.. టీఆర్ఎస్ ను పదే పదే గెలిపించేది.. ఇంతగా తెలంగాణ సంక్షేమం గురించి ఆలోచించే పార్టీ ఇంకేముంది.. అని చిన్నా పెద్దా తేడా లేకుండా.. అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు.

ఇది చూసైనా.. విపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని ప్రజలు హితవు పలుకుతున్నారు. ఇంత మంచి చట్టం వస్తుంటే.. ప్రశంసాపూర్వకంగా కనీసం రెండు మూడు మంచి మాటలు కూడా చెప్పలేని కాంగ్రెస్, బీజేపీ దుర్మార్గులు ఉన్నంతకాలం.. ప్రతిపక్షానికి విలువ అంటూ ఉండబోదని.. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ఆ పార్టీలు రాజకీయాలు చేయనంతకాలం వారి దుస్థితి ఇలాగే ఉంటుందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

Top