You are here
Home > Latest News > *బడుల పేరుతో బడే  మాటలు మాట్లాడకు లక్ష్మణ్

*బడుల పేరుతో బడే  మాటలు మాట్లాడకు లక్ష్మణ్

Spread the love
  • బడుల పేరుతో బడే  మాటలు మాట్లాడకు లక్ష్మణ్
  • తెలంగాణ లోని విద్యా విధానం దేశంలోనే భేష్
  • నోటికొచ్చినట్లు మాట్లాడితే మేధావి వై పోతావా లక్ష్మణ్
తెలంగాణలో బడుల గురించి విద్యా విధానం గురించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మతి లేకుండా మాట్లాడుతున్నాడు.దేశంలోనే తెలంగాణ విద్యా విధానం అత్యంత గొప్పగా ఉందని కేంద్ర సంస్థలు ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది.ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఎటువంటి పరీక్షలు పెట్టిన కూడా అందులో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యార్థులు అత్యద్భుతంగా ప్రదర్శన ఇవ్వడం జరిగింది.నోరు ఉందికదా అని పిచ్చి మాటలు మాట్లాడడం తప్ప లక్ష్మణ్ కి కనీస విషయ పరిజ్ఞానం అసలు ఉండదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిస్సంకోచంగా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం విద్యావిధానాన్ని మొదలుకొని అన్ని రంగాల్లో కూడా బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తోంది అని తెలంగాణ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.కాబట్టే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న విషయాన్ని మరొకసారి గ్రహించాలని విశ్లేషకులు లక్ష్మణ్ కి సూచిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రశ్నించే ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యా విధానం ఎంత బాగుందో ఒకసారి చెప్పాలి అని విశ్లేషకులు సవాల్ విసురుతున్నారు.
భారతీయ జనతా పార్టీ అంటేనే దేశానికి పట్టిన ఒక దరిద్రంగా దేశ ప్రజలందరూ భావిస్తున్నారు.కాబట్టే దాని ఆగడాలు రోజురోజుకీ పెరుగుతున్న వేళ కత్తిరించే పనిలో ప్రజలందరూ పడ్డారు. మహారాష్ట్ర మొదలుకొని ఇతర బిజెపి పాలిత రాష్ట్రాల్లో బిజెపి రోజు రోజుకీ క్షీణిస్తున్న పరిణామక్రమమే దీనికి సరైన ఉదాహరణగా పేర్కొనవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏమి పీకలేరు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Top