You are here
Home > Latest News > ఎగిరెగిరిప‌డింది.. ఆఖ‌రుకు బొక్క‌బోర్ల వ‌డింది బీజేపీ ఇజ్జ‌త్ పాయె.. డిపాజిట్ కూడా గ‌ల్లంతే..

ఎగిరెగిరిప‌డింది.. ఆఖ‌రుకు బొక్క‌బోర్ల వ‌డింది బీజేపీ ఇజ్జ‌త్ పాయె.. డిపాజిట్ కూడా గ‌ల్లంతే..

Spread the love
  • ఎగిరెగిరిప‌డింది.. ఆఖ‌రుకు బొక్క‌బోర్ల వ‌డింది
  • బీజేపీ ఇజ్జ‌త్ పాయె.. డిపాజిట్ కూడా గ‌ల్లంతే
  • ఈ పార్టీది వాపు మాత్ర‌మే.. బ‌లుపు కాదు

హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక‌ల పుణ్య‌మాని బీజేపీ ఇజ్జ‌త్ మొత్తం గంగ‌ల క‌లిసింది. తెలంగాణ‌లో బీజేపీ బ‌తికి బ‌ట్ట‌గ‌ట్టే చాన్స్ లేదు బిడ్డా అని హుజూర్‌న‌గ‌ర్‌వాసి కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. మోడీ గీడీ జాన్తా నై.. చ‌ల్ హ‌ట్ బే అని ఈడ్చి ముడ్డి మీద త‌న్నిండు.

మ‌త‌విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి ఓట్లు పొందుతామ‌ని చూస్తే కుద‌ర‌దు రా బేవ‌కూఫ్ అని బీజేపీ నాయ‌కుల ముఖం మీదే చెప్పేశాడు. తెలంగాణ జోలికి వ‌స్తే ముడి మీద తంతం అని బాజాప్తా చెప్పాడు. హుజూర్‌న‌గ‌ర్‌లో బీజేపీ క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక చ‌తికిల‌ప‌డింది. ఢిల్లీలో అమిత్ షా, మోడీ ముందు కోత‌లు కోసిన తెలంగాణ బీజేపీ నాయ‌కులు ఇప్పుడు త‌ల మీద త‌డిగుడ్డ ఏస్కొని పడుకోవ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేరు.

ఇన్నాళ్లూ వీళ్లు చెప్పిన మాట‌ల‌న్నీ కోత‌లేన‌ని ప్ర‌తి ఒక్క‌రికీ అర్థ‌మైంది. తెరాస‌ను నిలువ‌రించ‌డానికి ఢిల్లీ నుంచి అబ్జ‌ర్వ‌ర్‌ను తెచ్చుకున్నా ఫాయిదా దొర‌క‌లేదు. ఎన్ని కుట్ర‌లు చేసినా తెరాస ఓట్ల‌ను ఆప‌లేక‌పోయిండ్రు. షా, ల‌చ్చ‌న్న వంటి నాయ‌కులు.. వ‌చ్చే సారి మాదే అధికారం.. వంటి డైలాగులు చెప్పుడు ఇక‌నైనా మానుకోవాలి. తెలంగాణ‌కు నిధులు ఇవ్వ‌కుండా స‌తాయించ‌డాన్ని ఆపాలి. హ‌డ్డి మారి గుడ్డి దెబ్బగా మొన్న నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ..

ఇక నాకు తిరుగులేద‌నుకొని బొక్క‌బోర్లా ప‌డింది. తెలంగాణ‌లో కాంగ్రెస్‌తోపాటు బీజేపీకి స్థానం లేద‌ని హుజూర్‌న‌గ‌ర్ వాసి తేల్చిచెప్పేశాడు. ఈ రెండు పార్టీలూ దుకాణాలు స‌ర్దేసుకొని ఉత్త‌రాది మీద దృష్టి పెట్టుకోవాలి. కేసీఆర్ ముందు వీళ్లు నిల‌వ‌లేరు. ఎంత మంది నాయ‌కుల‌ను కొనుక్కొన్నా (చేర్చుకున్నామ‌ని చెప్పుకుంట‌రు) తెరాస ముందు గెల‌వ‌లేమ‌ని ఇప్ప‌టికైనా అర్థం చేసుకోవాలి.

Top