You are here
Home > Latest News > రైతన్నకు కేసీఆర్ వరం.. పంట మొత్తం కొంటోంది ప్రభుత్వం

రైతన్నకు కేసీఆర్ వరం.. పంట మొత్తం కొంటోంది ప్రభుత్వం

Spread the love

 

రైతన్నకు కేసీఆర్ వరం.. పంట మొత్తం కొంటోంది ప్రభుత్వం

 

– కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో వరం
– పంట మొత్తం కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి అభయం
– ఎంత ఖర్చైనా సరే.. వెనకాడేది లేదని ప్రకటించిన కేసీఆర్

కేసీఆర్ ప్రజా నాయకుడు.. జనం హృదయం ఎరిగిన నాయకుడు.. తనను నమ్ముకున్న ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడలేని నాయకుడు అని మరో సారి తన నిర్ణయంతో నిరూపించుకున్నారు. కరోనాతో ప్రపంచమే తల్లడిల్లుతున్న పరిస్థితుల్లో.. ఆర్థిక మాంద్యంతో ప్రపంచమే కుదేలవుతున్న పరిస్థితుల్లో.. మరోసారి కేసీఆర్ తనకే సాధ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆదాయమే గగనమైన నేపథ్యంలో.. రూపాయి రాక కూడా నెల నుంచి కష్టమవుతున్న పరిస్థితుల్లో.. అత్యంత ధైర్యవంతమైన నిర్ణయం తీసుకున్నారు.

రైతులు ఏ మాత్రం ఆందోళనకు గురి కాకుండా.. పంట మొత్తాన్ని ప్రభుత్వమే తీసుకుంటుందని చెప్పారు. ఇందుకు మార్కెటింగ్ శాఖకు ఏకంగా 25 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. అవసరమైతే ఇతర ఖర్చులు తగ్గించుకునైనా సరే.. రైతులు పండించిన వరి, మొక్కజొన్నను పూర్తిగా ప్రతి గింజతో సహా ప్రభుత్వమే కొంటుందని వెల్లడించారు. కాకపోతే.. కొన్ని విషయాలను సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రస్తుతం కరోనా కలకలం కొనసాగుతున్న నేపథ్యంలో.. రైతులు తమ పంట అమ్మకానికి ఏ మాత్రం తొందర పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతులందరికీ కూపన్లు పంపిణీ చేస్తుందని… ఈ వ్యవహారాన్ని వ్యవసాయ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు చూసుకుంటారని ప్రకటించారు. ఏ మాత్రం తొందర పడకుండా.. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎవరూ మార్కెట్ యార్డులకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి గింజ ధాన్యాన్ని.. నష్టమైనా సరే.. తామే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పారు.

అందుకే రైతన్నలారా.. జాగ్రత్తగా ఉండండి. మరి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండండి. మీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. డబ్బులను మీ అకౌంట్లకే జమ చేస్తుంది. దళారుల ప్రమేయం లేకుండా.. కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే మీకు అండగా నిలుస్తుంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆయనకు అండగా ఉందాం. సమస్యను పరిష్కరించుకుందాం. కరోనాను జయిద్దాం.

Top