You are here
Home > Uncategorized > ప్రధానికి అండగా కేసీఆర్.. కేసీఆర్ కు అండగా తెలంగాణ

ప్రధానికి అండగా కేసీఆర్.. కేసీఆర్ కు అండగా తెలంగాణ

Spread the love

ప్రధానికి అండగా కేసీఆర్.. కేసీఆర్ కు అండగా తెలంగాణ

–      హేళన చేసిన వారి చెంప ఛెళ్లుమనిపించేలా కేసీఆర్ వ్యాఖ్యలు

–      అలాంటి వారు కుసంస్కారులని ముఖ్యమంత్రి తీవ్ర కామెంట్లు

–      తీరు మార్చుకోవాలని రాష్ట్ర అధినేత స్థాయిలో హెచ్చరికలు

ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు. జనతా కర్ఫ్యూ నాడు సంపూర్ణ మద్దతుగా నిలిచిన ప్రకారంగానే.. దీపాలు వెలిగించే ప్రక్రియలోనూ అండగా నిలిచారు. ఆ విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. ప్రధానిని హేళన చేసిన వారిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. జాతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారని.. ప్రజలను సంఘటితం చేసే క్రమంలో అవన్నీ సానుకూల ఫలితాలను ఇస్తాయని.. మంచి ప్రభావాన్ని కలగజేస్తాయని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ.. తాను ప్రజలను ఐక్యం చేసేందుకు పడిన ప్రయాసను కేసీఆర్ గుర్తు చేశారు. నాడు కూడా ప్రత్యర్థులు ఇలాగే అవహేళన చేసిన విషయాన్ని తన వ్యాఖ్యలతో ప్రజలకు స్ఫురించేలా చేశారు. ఇప్పుడు మోదీని తిట్టి పోస్తున్న వారు సంస్కారం లేని వారని.. వారంతా దుర్మార్గులని.. ఇలాంటి ప్రయత్నాలు చేసే వారు దేశ ద్రోహులని.. ప్రజా ద్రోహులని అన్నారు. ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేసి.. కేంద్రానికి ప్రభుత్వం పరంగా తమ స్పష్టమైన మద్దతను తెలియజేశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్.

అంతే కాదు.. కేంద్రం ఎలాంటి చర్య తీసుకున్నా కూడా తెలంగాణ పరంగా తాను, ప్రజలు అండగా నిలుస్తారని తన వ్యాఖ్యలతో కేసీఆర్ తేల్చి చెప్పారు. కేంద్రంతో తాను నిత్యం సంప్రదింపుల్లో ఉన్నానని.. కరోనా విషయంలో ఏ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా లేదని అన్నారు. ఇలాంటి చర్యలకు ప్రజల సహకారం కావాలని కోరారు. కరోనాను తరిమికొట్టే చర్యల్లో బాగం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రానికి ఎలాంటి భేషజాలు లేకుండా.. సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజలు కూడా అందుకు పూర్తి అండగా నిలుస్తూ.. కేసీఆర్ అడుగులో అడుగు వేస్తున్నారు.

ఈ విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం అప్పుడు అత్యవసరం. చేతనైతే సహకారం అందిద్దాం. అలా ఇష్టం లేని వాళ్లైతే మాత్రం కనీసం ఇంటికే పరిమితం కావడం ఉత్తమం. వాస్తవాలు గ్రహించండి. కరోనాను తరిమికొట్టండి. సీఎం కేసీఆర్ సదుద్దేశాన్ని అమలు పరచడంలో భాగం కండి. ఇది మీ కోసం.. మీ మంచి కోసం. అర్థం చేసుకోండి.

Top