You are here
Home > Latest News > అభ్యర్థి కోసం ఆరాటం.. కాంగ్రెస్ లో మరోసారి కనబడుతున్న లోపం..!

అభ్యర్థి కోసం ఆరాటం.. కాంగ్రెస్ లో మరోసారి కనబడుతున్న లోపం..!

Spread the love

 

అభ్యర్థి కోసం ఆరాటం.. కాంగ్రెస్ లో మరోసారి కనబడుతున్న లోపం..!

– హుజూరాబాద్ వేదికగా కాంగ్రెస్ లో బయటపడుతున్న నైరాశ్యం

– సరైన అభ్యర్థి దొరకక.. కేడర్ లో పెరుగుతున్న నిరాశ, నిస్పృహ

– పేరుకు అందరూ నాయకులే.. అభ్యర్థే కరవయ్యాడా.. అంటున్న జనం

రాజకీయ వ్యభిచారి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. కాంగ్రెస్ పార్టీ మరింతగా దిగజారి పోతోంది. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరిగితే… పార్టీ తరఫున నిలబెట్టేందుకు కనీసం అభ్యర్థిని కూడా ఖరారు చేయలేని స్థితికి ఆ పార్టీ పడిపోయింది. ఇటు చూస్తే.. అధికార పార్టీ సంక్షేమం.. అటు చూస్తే తాజా మాజీ ఎమ్మెల్యే కబ్జాల అలియాస్ ఈటల. వీరి మధ్యలో చోటు కోసం.. లేని పట్టును సాధించడం కోసం ఓ అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది.

ఇదే.. కాంగ్రెస్ హుజూరాబాద్ కేడర్ లో నైరాశ్యాన్ని నింపుతోంది. సరైన అభ్యర్థిని ఖరారు చేయలేని నాయకత్వ లోపం.. వారికి శరాఘాతంగా మారుతోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా.. మీ అభ్యర్థి ఎవరూ.. అని జనాలు అడుగే ప్రశ్నకు సమాధానం చెప్పలేని వైఫల్యం.. వారిని వెంటాడుతోంది. విధి లేక.. పార్టీ శ్రేణులు పక్క పార్టీల వైపు చూడాల్సి వస్తోందని.. లోకల్ లీడర్లు కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

కాంగ్రెస్ అంటే పేరుకు అంతా నాయకులే. ప్రతి ఒక్కడూ సీఎం అభ్యర్థే. హుజూరాబాద్ లో బాధ్యతలు చూస్తున్న భట్టి విక్రమార్క మొదలు.. నియోజకవర్గ పరిధిలోని మండలాలకు ఇన్ చార్జులుగా నియమితులైన ప్రతి ఒక్కరూ.. జాతీయ స్థాయి నాయకుల్లా ఫీలయ్యేవారే. అందుకే.. బాధ్యులు మాత్రమే పైకి కనబడుతున్నారు. అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పార్టీనా.. ఎన్నికల్లో పోటీ చేసేది.. ప్రత్యర్థులపై విమర్శలు చేసేది?

కాంగ్రెస్ నేతలు వాస్తవాలు గుర్తించే స్థాయిలో లేకపోవడమే.. హార్డ్ కోర్ కేడర్ కు ఇబ్బందిగా మారుతోంది. తెలంగాణ ఏర్పాటు నుంచి చేసిన తప్పులనే.. ఇప్పుడు కూడా చేస్తుండడమే హుజూరాబాద్ లోనూ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా.. అసలు అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉందా.. అన్న మాట కార్యకర్తలనుంచి వినిపిస్తుండడం.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న దీన స్థితికి అద్దం పడుతోంది.

Top