You are here
Home > Uncategorized > కాంగ్రెస్ పని ఎప్పుడో ఖతమైంది..

కాంగ్రెస్ పని ఎప్పుడో ఖతమైంది..

Spread the love

కాంగ్రెస్ పని ఎప్పుడో ఖతమైంది..

  • దాంతో కలిసి తెరాస పనిచేయడమేంటి ?
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చాలా కామెడీ చేస్తాడు.
  • ఈయన ప్రెస్మీట్ ఉంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్.

ఈ మహామేధావి నిన్న ఏమన్నాడో తెలిస్తే షాక్ కొట్టినట్టవుతుంది. టీఆర్ఎస్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పనిచేస్తోందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమాలు చేస్తున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ సైతం అదే పనిగా కార్యక్రమాలు చేపట్టడమే ఇందుకు ఉదాహరణ అట.

వాస్తవం ఏంటంటే అసలు ఈ రెండు పార్టీలను తెరాస తనకు పోటీగానే చూడటం లేదు. కాంగ్రెస్ పని ఎప్పుడో ఖతమైంది. నాయకులు చెల్లాచెదురు అయిపోయారు. ఉన్న కొద్ది మంది నాయకులు గ్రూపు పంచాయితీలతో బిజీబిజీగా ఉన్నారు. వీళ్లు ప్రజలకు ఎప్పుడో దూరమయ్యారు.

బీజేపీ, కాంగ్రెసు, టిడిపిలను గెలిపించినా ప్రయోజనం లేదని ఓటర్లకు అర్థమై పోయింది. బీజేపీలాగే కాంగ్రెసు పరిస్థితి జాతీయ స్థాయిలో కానీ, ప్రాంతీయ స్థాయిలో కానీ బాగోలేదు. సోనియా, రాహుల్ పార్టీ గురించి పట్టించుకోవడమే లేదు. ఇక రాష్ట్రస్థాయిలో కార్యకర్తలు తక్కువ, నాయకులు ఎక్కువ అయిపోయారు.

కాలు కదిపి, ఉద్యమాలు, నిరసనలు చేసేవారు లేరు కానీ, అవతలివాడు ముందుకెళుతూంటే కాలు లాగే రకాలే ఉన్నారు. ఏమైనా అంటే సీనియర్ల మంటారు. సోనియా పేరు చెప్పి బెదిరిస్తారు. వీళ్లని అదిలించడానికి పైన ఎవరూ లేరు. దశాబ్దాలుగా తెలంగాణలో పాతుకుపోయిన కాంగ్రెసు ఈ కారణాల వలన బలహీనపడి పోయింది.

కాంగ్రెసు స్థానంలో బిజెపి వచ్చేందుకు అవకాశాలున్నాయా అని ఆలోచిస్తే, బిజెపి ప్రభావం నగరానికి, జిల్లాలలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది తప్ప గ్రామగ్రామాన బలం లేదని ఒప్పుకోక తప్పదు. దశాబ్దాలుగా దాని నాయకులందరూ, నగరానికి చెందినవారే. కిషన్ రెడ్డి తప్ప దాదాపు అందరూ వయసు మీరినవారే. వెంకయ్య నాయుడు ధర్మమాని బిజెపికి ఉమ్మడి రాష్ట్రంలో ఎదుగుదల లేకుండా పోయింది. నాగం జనార్దన రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వివేక్, అరుణ వంటి వాళ్లు బిజెపికి వచ్చి నిరాశపడ్డారు. మోదీ వచ్చాక బిజెపి అనేక రాష్ట్రాలలో బలపడుతున్న సమయంలో యిక్కడ కిషన్ రెడ్డి ఏదైనా చేయగలడేమో అనుకుంటే కేంద్రమంత్రిగా తీసుకుని వెళ్లిపోయారు.

దాని వలన తెలంగాణకు లాభం కలగలేదు, బిజెపి పార్టీకీ కలగలేదు. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చారు. ఆయన చేసే ఆర్భాటం అంతా యింతా కాదు. ఆయన మంచి ఆర్గనైజర్ కాడు. మంచి ఉపన్యాసాలు చేసిన దాఖలా కనబడదు. ఏం మాట్లాడతాడో పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. ఆయన గలీజ్ మాటలను తట్టుకోవడం ఇంకా కష్టం.

ఏ మాట అనాలో, ఏ మాట అనకూడదో ఆయనకు బొత్తిగా విచక్షణ లేదు. హార్డ్‌కోర్ సంఘీయులకు తప్ప ఆయన ధోరణి నచ్చదు. తటస్థులను యిరిటేట్ చేసి పార్టీ పట్ల విముఖుల్ని చేస్తాడు. ఈ విషయాలన్నీ కేసీఆర్కు తెలియనివా ? ఈ రెండు పార్టీలు తమ గోతులను తామే తవ్వుకుంటున్నాయి. వీటిని తెరాస గెలకాల్సిన అవసరమే లేదు.

Top