You are here
Home > Latest News >  తెలంగాణ కాంగ్రెస్​ ఎంపీల్లారా.. కొంచెమైనా సిగ్గుందా?

 తెలంగాణ కాంగ్రెస్​ ఎంపీల్లారా.. కొంచెమైనా సిగ్గుందా?

Spread the love
  •  తెలంగాణ కాంగ్రెస్​ ఎంపీల్లారా.. కొంచెమైనా సిగ్గుందా?
  • బీజేపీతో కలిసి ఉత్తమ్​, కోమటిరెడ్డి, రేవంత్​రెడ్డి కుట్రలు

రాష్ట్రానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కుట్రలు పన్నుతున్న బీజేపీ ఎంపీలకు ఇప్పుడు కాంగ్రెస్​ ఎంపీలు కూడా తోడైన్రు. అవతల కాంగ్రెస్​ చీఫ్​ సోనియా గాంధీ.. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తుంటే.. మన ఎంపీలు మాత్రం అదే మోదీ సంకనాకడానికి సిద్ధమైన్రు.  ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందివ్వాలనుకుంటున్న సీఎం కేసీఆర్​పై పితుర్లు చెప్పే ప్రయత్నం చేసిన్రు. పీఎం అపాంయింట్​మెంట్​ ఇయ్యకపోయేసరికి మన ముగ్గురు కాంగ్రెస్​ ఎంపీలు  కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ దగ్గరికి పోయిన్రు. ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉందని, సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని అడిగిన్రు.

ఇల్లీగల్​ సమ్మెపై ఎవరెవర్నో కలుస్తున్న ఈ సిగ్గు తప్పిన కాంగ్రెస్​ ఎంపీలు.. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా నోరు తెరిసిన్రా? పార్లమెంట్​లో కనీసం ఒక్కటంటే ఒక్క ప్రశ్నైనా అడిగిన్రా? బుద్ధిలేని గాడిదల్లాగా ఉరుక్కుంట పోయిన ఉత్తమ్​, కోమటిరెడ్డి, రేవంత్​రెడ్డిలకు ఆ గడ్కరీ సారు మంచిగనే గడ్డిపెట్టిండు. ‘‘ఆర్టీసీ నష్టాలు భరించడం మా పని కాదురాబై”అని తెగేసి చెప్పిండు. బీజేపీ ఎంపీల చెప్పుడు మాటలిని, సీఎం కేసీఆర్​కు ఫోన్​ చేశానని, ఆర్టీసీలో కేంద్రానికి వాటా ఉంది కాబట్టి  నష్టాల్ని కూడా భరించాలని సీఎం అడిగారని, అది కేంద్రం వల్ల కాదని తానే చెప్పినట్లు గడ్కరీ అనేసరికి.. కాంగ్రెస్​ ఎంపీలు అన్నీ మూసుకుని బయటికొచ్చేసిన్రు.

ఓరి సన్నాసి కాంగ్రెస్​ ఎంపీల్లారా.. ఆర్టీసీలో ఇతర ఆపరేటర్లకు అవకాశం కల్పించాలన్న చట్టం చేసిందే మోదీ. ఆ చట్టాన్ని పార్లమెంట్​లో పెట్టిందే గడ్కరీ. దద్దమ్మ ఫేసులతో మీరు పోయి మళ్లీ వాళ్లనే కలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పటికైనా సిల్లీ వేషాలు ఆపేసి, తెలంగాణకు పనికొచ్చే పనేదైనా ఉంటే చూడండి.. అది చేతకాకుంటే అన్నీ మూసుకోన్రి. రాష్ట్రంపై కుట్రలు చేస్తే ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతరు జాగ్రత్త.

Top