You are here
Home > Latest News > కరోనా రాష్ట్రంలో కంట్రోల్ లోనే ఉంది.

కరోనా రాష్ట్రంలో కంట్రోల్ లోనే ఉంది.

Spread the love
  1. కరోనా రాష్ట్రంలో కంట్రోల్ లోనే ఉంది.
  2. దేశంలో కరోనా ఏమైనా తగ్గిందా తెలంగాణలో తగ్గడానికి..
  3. కట్టడిలో లోపాలు గుణపాఠాలు నేర్వని సర్కారా??.
  4. తెలంగాణ మీద ఆంధ్రా జ్యోతికి ఎందుకు ఇంత అక్కసు.
  5. ఏపీలో 4లక్షల కేసులు దాటాయి.. మరి దానిమీద రాయరేం.
  6. జగన్ గెస్ట్ హౌస్ కు పిలిచి బెల్టు దెబ్బలు రుచి చూపిస్తాడని భయమా?.

ఆంధ్రా జ్యోతి పత్రిక తెలంగాణ  అంటే నిలువెల్లా విషం చిమ్ముతుంది. కరోనాపై విషపు రాతలు రాస్తోంది. ప్రభుత్వం ఏమీ పనిచేయనట్లు.. కరోనా దారుణంగా వ్యాపిస్తున్నట్లు వార్తలు ప్రచురిస్తోంది. కానీ.. దేశంలో సహా.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. కరోనా కేసులు తెలంగాణలో చాలా తక్కువ ఉన్నాయన్న విషయం ఎందుకు రాయడం లేదు. పక్క రాష్ట్రం ఏపీలో 4లక్షల కేసులు దాటాయి. అక్కడితో పోలిస్తే.. ఇక్కడ చాలా బెటర్ అని రాయడానికి మీకు చేతులు రావు. కానీ.. లోపాలు, లోటు పాట్లు అంటూ సొల్లు రాతలు రాస్తున్నారు. సిగ్గుందా మీకసలు.

టెస్టింగ్, ట్రేసింగ్ లేకుండా రాష్ట్రంలో రోజూ 60వేల టెస్టులు చేస్తున్నారా?. వెయ్యి రెండు వేల కెపాసిటీ నుంచి 60వేలు చేసే స్థాయికి వస్తే మెచ్చుకోవాల్సింది పోయి.. విమర్శలు చేయడం ఏంటి?. ఒక్క నెలలో 8లక్షల టెస్టులు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా??. ప్రతీ గ్రామం నుంచి ప్రతీ పట్టణం వరకు ఆశా వర్కర్లు ఫోన్ చేసి మరీ టెస్టులు చేయిస్తున్నారు. ఎవరైతే క్లోజ్డ్ కాంటాక్ట్ ఉన్నారో వారికి ఎటువంటి లక్షణాలు లేకున్నా యాంటిజెన్ టెస్టులు చేసి పంపుతున్నారు. కావాలంటే రాండి.. టెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయో మేం చూపిస్తాం. తెలంగాణలో సగటున 709 కేసులే.. కానీ ఇతర రాష్ట్రాల్లో వేలల్లో ఉన్నాయి. మరి దీనికేమంటారు?.

ఏదో విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని కంకణం కట్టుకున్నారు. 50శాతం మందే వైద్య సిబ్బంది ఉన్నా.. ప్రజలకు ఎక్కడా లోటు రాకుండా చూసుకుంటున్నారు. 5వేల ఆక్సిజన్ బెడ్లు కాదు.. 10వేలకు పైగా ఉన్నాయి. ప్రతీ కరోనా ఐసోలేషన్ వార్డులో ఆక్సిజన్ సరఫరా చేసేలా పైప్ లైన్స్ ఏర్పాటు చేశారు. ఉన్న బెడ్లే పూర్తిగా నిండే పరిస్థితి లేదు. ఇంక కొత్తగా బెడ్లు ఏర్పాటు చేయడం ఎందుకు?. కరోనాపై ప్రభుత్వం బాగా పనిచేస్తోంది. దేశంలో కరోనా వ్యాప్తికంటే తెలంగాణలో చాలా తక్కువగా ఉంది. టెస్టింగ్, ట్రేసింగ్ బాగుంది. కేవలం ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తేవాలన్న ఉద్దేశంతోనే ఆంధ్రా జ్యోతి పిచ్చి రాతలు రాస్తోంది.

Top