You are here
Home > Latest News > ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే విపక్షాలు మునుగుడే

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే విపక్షాలు మునుగుడే

Spread the love
  1. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే విపక్షాలు మునుగుడే
  2. విపక్షాల  డిపాజిట్లు గల్లంతు
  3. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చిన తెరాస విజయం

 

తాము ముందస్తు ఎన్నికలకు రెడీ అని సీఎం కేసీఆర్ ప్రకటించగానే విపక్షాల లాగులు తడుస్తున్నాయి. ఈ ప్రకటనతో బీజేపీ, కాంగ్రెస్కు షాక్ కొట్టినంత పనైంది. ముందుస్తు ఎన్నికలు జరిగితే వీళ్లకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.ఎందుకంటే 2018లో ముఖ్యమంత్రి కొట్టిన చావుదెబ్బ నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికీ కోలుకోలేదు. ఆ రెండు పార్టీల నాయకులకు కలలో కూడా ‘ముందస్తు’ పదం వణుకు పుట్టిస్తున్నది. నిజానికి తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగవని సీఎం కేసీఆర్‌ పలుమార్లు స్పష్టంచేసినా.. టీఆర్‌ఎస్‌ నాయకులు పదే పదే చెప్పినా.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మాత్రం అదే మేనియాలో ఉండిపోతున్నారు.

 

నిజానికి ముందస్తు ఎన్నికలపై తెరాసకు ఆసక్తే లేదు. ఆ అవసరమూ లేదు. ముఖ్యమంత్రే ముందస్తుకు వెళ్తున్నారంటూ పెడబొబ్బలు మొదలుపెట్టారు. విపక్షాల నేతలకు అంతగా దమ్ముంటే.. ముఖ్యమంత్రి సవాల్‌ను స్వీకరించవచ్చుకదా ? కేంద్రంలోని బీజేపీ ఒక తేదీ ప్రకటిస్తే.. తాను ఎన్నికలకు రెడీ అని సీఎం కేసీఆర్‌ చెప్పినప్పుడు.. దానికి సూటిగా స్పందించకుండా ఆ పార్టీ తిట్లు శాపనార్థాలు పెట్టింది.

పోటీ చేసిన 108 స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకొన్న ఘనత బీజేపీది. పైకి మేం రెడీ అంటే.. మేం రెడీ అని జబ్బలు చరుచుకొంటున్నా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఆనాటి గతే మళ్లీ పట్టకతప్పదు. ఇక కాంగ్రెస్ గురించి అయితే మాట్లాడుకోవడం వేస్ట్. రాష్ట్ర అసెంబ్లీకి తమ పార్టీ తరఫున పోటీ చేయడానికి బీజేపీకి కాంగ్రెస్కు అభ్యర్థులే దొరకడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా 119 మంది నాయకులను 119 నియోజకవర్గాలకు పంపించారు. నియోజకవర్గానికి ఒకరినైనా పట్టుకొచ్చుకొని పార్టీ కండువా కప్పాలని తెగ ఆరాటపడ్డారు. వివిధ పార్టీల నేతల ఇండ్లకు వెళ్లి మరీ అడిగొచ్చారు.ఎవరూ పట్టించుకోలేదు. ఉన్నపళంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లగలిగే స్థితిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు లేవు.

గత ఎన్నికలకు ముందు నాటి కంటే పార్టీల పరిస్థితి ఏమాత్రం మెరుగు పడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహాత్మకంగా బీజేపీ గురించి పదే పదే మాట్లడటం వల్లనే పార్టీ లైవ్‌లో ఉంది తప్ప సంస్థాగతంగా పుంజుకోలేదు. గ్యాస్‌ సిలిండర్‌ ధర, పెట్రోల్‌, డీజిల్‌, మంచినూనె, నిత్యావసర వస్తువుల పెరుగుదల, యాసంగిలో వరి ధాన్యాన్ని కొనుగోలుకు కేంద్రం నిరాకరించడం వంటి చర్యలతో గత ఎన్నికలకు ముందు కంటే పార్టీ ప్రతిష్ఠ ఇంకా దిగజారిపోయింది. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్‌ పార్టీయే. ముందస్తుకు వెళ్తే పార్టీ మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. టీపీపీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకమై ఏడాది అవుతున్నప్పటికీ రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరగలేదు. రాష్ర్టానికి నలుగురు ఏఐసీసీ ఇంచార్జిలను నియమించినా, రాహుల్‌గాంధీ అనేకసార్లు రాష్ట్ర నేతలతో సమావేశమైనా టీపీసీసీ ఇప్పటికీ గాడిన పడలేదు.

Top