You are here
Home > Latest News > రైతు ఆత్మహత్యలు తగ్గించింది టీఆర్ఎస్

రైతు ఆత్మహత్యలు తగ్గించింది టీఆర్ఎస్

Spread the love

 

  • రైతు ఆత్మహత్యలు తగ్గించింది టీఆర్ఎస్
  • తెలంగాణ ఏర్పాటు సమయంలో రైతు ఆత్మహత్యల్లో..
  • తెలంగాణ ఒకటి, రెండు స్థానాల్లో ఉండేది.
  • కానీ నేడది ఐదవ స్థానానికి పడిపోయింది.
  • గతంలో వేలల్లో రైతు బలవన్మరణాలుంటే.. అవి నేడు వందలకు తగ్గాయి.
  • రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తోంది.

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పాలకులు పెట్టిన బాధలు ఎన్నో తీర్చారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు సకాలంలో అందేలా చూశారు. రైతుకు ఎటువంటి కష్టం రాకుండా చేసేందుకే 24గంటల కరెంటు ఇస్తున్నారు. కృష్ణా, గోదావరి ద్వారా.. ఆయకట్టు రైతాంగానికి పుష్కలంగా నీరు ఇస్తున్నారు సీఎం కేసీఆర్. రైతు బాగుపడేందుకు 17 వేల కోట్ల రుణమాఫీ చేశారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా లేని రైతుబంధు, రైతుబీమా పథకాలు తెచ్చారు సీఎం కేసీఆర్.

ప్రభుత్వ చర్యలతో.. రైతులే కాదు.. వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు కూడా వందశాతం తగ్గాయని స్వయంగా కేంద్రమే అంగీకరించింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో.. 12 వేల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  దేశానికి అన్నం పెట్టే రైతు కష్టాన్ని తన కష్టంగా భావించి.. రైతుబిడ్డగా సీఎం కేసీఆర్.. అన్నదాతల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. వెయ్యి కోట్లతో 1200 గోదాములు నిర్మించారు. లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనేలా చేశారు.

టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన చర్యలతో రైతు ఆత్మహత్యలు భారీగా తగ్గాయి. ఒకవేళ రైతు ఏదైనా కారణంతో చనిపోతే.. వారి కుటుంబం రోడ్డున పడొద్దన్న ఉద్దేశంతో 5లక్షల రైతుబీమా అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా లక్ష కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.  దేశంలో అన్ని రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలు పెరిగినా.. కేవలం తెలంగాణలో మాత్రం రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు తగ్గాయని స్వయంగా కేంద్రమే అంగీకరించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, పార్లమెంట్ సాక్షిగా రైతు ఆత్మహత్యల లెక్కలు చదివి వినిపించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో 50శాతానికిపైగా ఆత్మహత్యలు పెరిగితే.. అదే తెలంగాణలో కేసీఆర్ పాలనలో 50శాతానికి పైగా రైతు ఆత్మహత్యలు తగ్గాయని, రైతు కూలీల ఆత్మహత్యలు 90శాతం తగ్గాయని కేంద్రం చెప్పింది. ఇప్పుడు.. ఎన్సీఆర్బీ లెక్కల్లోనూ కేవలం 499మంది మాత్రమే రైతులు గతేడాది చనిపోయారని చెప్పడం జరిగింది. అంటే.. రైతు ఆత్మహత్యలు 90శాతం ప్రభుత్వం తగ్గించగలిగింది.

 

Top