You are here
Home > Uncategorized > ఇదే కదా..  రైతులు కోరుకున్నది.. అదే కదా.. కేసీఆర్ చేస్తున్నది!

ఇదే కదా..  రైతులు కోరుకున్నది.. అదే కదా.. కేసీఆర్ చేస్తున్నది!

Spread the love

ఇదే కదా..  రైతులు కోరుకున్నది.. అదే కదా.. కేసీఆర్ చేస్తున్నది!

– రైతులు కోరిన సహకారాన్ని అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

– పెట్టుబడి మొదలు.. కొనుగోళ్లవరకూ సర్వస్వం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే

– రైతుల ఆదాయం పెంచేలా సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ విధానాలు

పెట్టుబడికి అప్పు.. ఆ అప్పు తీర్చడానికి మళ్లీ అప్పు.. చివరికి అతివృష్టితోనే.. అనావృష్టితోనే సాగులో మిగిలిన నష్టాల కారణంగా మళ్లీ అప్పు. ఇదే కదా.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితి.. ఇదే కదా తలాపున 2 జీవ నదులు పారుతున్నా ఎండిన పొలాలను చూసి రాష్ట్ర రైతులు కన్నీటి రోజులు గడిపింది. ఇలాంటి దుర్భరమైన పరిస్థితిని.. ఆనాటి రైతన్నల ఆత్మహత్యల తెలంగాణను.. తన విధానాలతో మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కింది.

అధికారంలోకి వచ్చిననాడే.. తాను రైతు బిడ్డనని.. సాగును బాగు చేసి చూపిస్తానని శపథం చేసిన కేసీఆర్.. ఉద్యమ పంథాలోనే విధానాలను అమలు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. రైతుకు పెట్టుబడి సాయం అందించారు. రైతులకే కాక.. పంటలకూ బీమా సదుపాయం కల్పించారు. పంటను కొనుగోలు చేయడంలోనూ దాతృత్వాన్ని ప్రదర్శిస్తూ.. రైతన్నలకు కొండంత అండగా నిలుస్తూ.. దార్శనికత చాటుకుంటున్నారు.

అలాంటి చర్యల ఫలితంగానే.. నేడు దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారింది. ధాన్యం దిగుబడిలో నంబర్ వన్ గా ఉన్న పంజాబ్ ను పక్కకు జరిపి.. 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడితో దేశంలోనే నంబర్ వన్ స్థానం సొంతం చేసుకుంది. 33 జిల్లాల్లో గతంలో ఉన్న 4 లక్షల టన్నుల గోదాముల సామర్థ్యాన్ని.. నేడు 25 లక్షలకు పెంచి రైతులకు దన్నుగా నిలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 2.5 కోట్ల ఎకరాల భూములు ఉంటే.. రైతుల దగ్గర ఉన్న సుమారు కోటిన్నర ఎకరాల్లో.. ఏకంగా కోటి ఎకరాలను సాగు దిశగా మళ్లించి.. ఇంతటి సత్ఫలితాలను ప్రభుత్వం సాధించగలిగింది.

5 వేల ఎకరాలకో క్లస్టర్ గా ఏర్పాటు చేసి.. ప్రత్యేక అధికారిని నియమించి సాగు తీరును అధ్యయనం చేసిన ప్రభుత్వం.. ధరణి వంటి వసతి కల్పించి.. రైతుల భూములను ఆన్ లైన్ చేసింది. అక్రమాలకు అడ్డుకట్ట వేసింది. ఫలితంగా.. రైతు బంధు అమలు.. 95 శాతానికి పైగా సక్రమంగా జరిగే వెసులుబాటు కలిగింది. అర్హులకే ప్రభుత్వ ఫలం అందుతోంది. ఇలాంటి చర్యలతోనే.. తెలంగాణ రైతాంగం మునుపెన్నడూ లేని విధంగా.. ఆర్థికంగా బలోపేతమైంది.

అందుకే.. రాష్ట్ర రైతంగం కేసీఆర్ కే జై కొడుతోంది. పంటను కాపాడుకుని దేశానికి అన్నం పెడుతున్నట్టే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకుని ప్రజలకు మంచి జరిగేందుకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని యావత్ తెలంగాణ రైతు లోకం ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తోంది.

Top