You are here
Home > Latest News > కరోనాపై పోరులో మనమే బెస్ట్​ దేశానికి ఆదర్శం తెలంగాణ…

కరోనాపై పోరులో మనమే బెస్ట్​ దేశానికి ఆదర్శం తెలంగాణ…

Spread the love

 

  • కరోనాపై పోరులో మనమే బెస్ట్​
  • దేశానికి ఆదర్శం తెలంగాణ…
  • వ్యాధిపై పోరులో అందరి కంటే ఫస్ట్​
  • సత్ఫలితాలను ఇస్తున్న కేసీఆర్​ నిర్ణయాలు
  • మర్కజ్​ కేసులు లేకుంటే కరోనా ఫ్రీ స్టేట్​ అయ్యేదే

 

ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్​ కాకుండా వేరే ఎవరైనా ముఖ్యమంత్రి ఉండి ఉంటే ? ఒక్క‌సారి ఊహించుకోండి. తెలంగాణ రాష్ట్రం ఆగమయ్యేది కదూ  ప్రజలు పిట్టల్లా రాలిపోయేవారు. అమెరికా, ఇటలీలో నమోదైనట్టు కరోనా కేసులు విజృంభించేవి. స్మశానాలు చాలకపోయేవి. అదృష్టవశాత్తూ మ‌న‌కు ఒక సమర్థ నాయకుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన పరిస్థితి బాగుంది. ఇదే టైంలో కాంగ్రెస్​ అధికారంలో ఉండి ఉంటే ఏమయ్యేదో ఒక్కసారి అంచ‌నా వేయండి. కరోనా నియంత్రణ అని చెప్పి నిధులన్నీ నలిపేసేవారు. డబ్బంతా నాయకుల జేబుల్లోకి వెళ్లేది. ఆస్పత్రుల్లో మందులు ఉండేవి కావు. కనీసం మాస్కులకూ దిక్కుండేది కాదు. తాము ఏమీ చేయలేమని చేతులెత్తేసేవారు. అదే కేసీఆర్​ నిర్ణయాలను గమనించండి. 24 గంటలూ ఆయన కరోనా కట్టడిపైనే దృష్టి పెడుతున్నారు. గంటకూ గంటకూ అధికారులకు ఆదేశాలు వెళ్తున్నాయి. ఇతర రాష్ట్రాల సీఎంలు కేసీఆర్​ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కేసీఆర్​ మాటలే మంత్రాల్లా పనిచేస్తున్నాయి. ప్రజల్లో భరోసాను నింపుతున్నాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాయి.ఈ ప్రభుత్వం తమను తప్పక ఆదుకుంటుందన్న భరోసాను కేసీఆర్​ అందించారు.

స‌మ‌ర్థంగా లాక్‌డౌన్ నిర్వ‌హ‌ణ‌

కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇవ్వడంతో లాక్‌డౌన్‌లో ప్రజలకు నిత్యావసరాల కోసం ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. అయితే వైరస్‌ ప్రమాదంనుంచి తెలంగాణ బయటపడుతుందనుకున్న దశలోనే ఢిల్లీ మర్కజ్‌లో జరిగిన మతప్రార్థనల వ్యవహారం కరీంనగర్‌లో వెలుగుచూసింది. ఈ విషయాన్ని తొలుత దేశానికి తెలియజేసింది కూడా తెలంగాణనే! అదీ కేసీఆర్​ ట్యాలెంట్​!  కరోనా పాజిటివ్‌ వచ్చినవాళ్లు ఎక్కడినుంచి ఇంటికి ఎలా వచ్చారనే సమాచారాన్ని సేకరించడానికి, ఎవరెవరిని కలిశారో తెలుసుకొనేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని కేసీఆర్​ సూచించారు. అందుకే డ్రోన్లతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. సీఎం ముందుచూపు వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారు మినహా మిగతా అంతా దాదాపు కంట్రోల్‌కు వచ్చింది.  తెలంగాణ ప్రభుత్వం గత నెల రెండో వారం నుంచే కరోనా వైరస్‌ కట్టడికి చర్యలు ప్రారంభించింది.   నిత్యావసరాల సరఫరాకు కమిటీని ఏర్పాటుచేసి మానిటరింగ్‌ చేస్తున్న‌ది. ధరలు పెరుగకుండా, కొరతలేకుండా చూస్తున్న‌ది. పేదవాళ్లందరికీ అన్నపూర్ణ పథకం ద్వారా భోజనాలు పెడుతున్నారు. నిరుద్యోగుల కోసం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. వీటితోపాటు 12 కిలోల బియ్యం, రూ.1,500లు అదనం. బిచ్చగాళ్లూ ఉపవాసం ఉండకుండా చర్యలు తీసుకున్నారు. ప్రతి ధాన్యం గింజను గ్రామాల్లోనే కొంటున్నారు. కూరగాయలు, కిరణా సామగ్రికి ఇబ్బందులు లేకుండా సప్లై చెయిన్లను పునరుద్ధరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి పడనంత కష్టం కేసీఆర్ పడుతున్నారు. ఆయన శ్ర‌మ‌ వృథా కావడం లేదు. కరోనా తోకముడిచిపారిపోతోంది.

 

Top