You are here
Home > Latest News > శభాష్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శభాష్

శభాష్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శభాష్

Spread the love

 

  • శభాష్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శభాష్
  • ఒక్కరోజులోనే ఆరు వేల పైగా ఇండ్లకు తిరిగి పరీక్షలు చేసిన ప్రత్యేక వైద్య బృందం. 
  • విపత్కర పరిస్థితి నుండి బయటపడేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న ఆరోగ్య సిబ్బంది
తెలంగాణ రాష్ట్రంలోని వైద్య బృందం తమ నిబద్ధతతో రాష్ట్ర ప్రజలందరికీ ప్రేమానురాగాలు గైకొంటున్నది.కరీంనగర్ లో ఇండోనేషియా నుంచి వచ్చిన కరోన వ్యాధిగ్రస్థులు పాజిటివ్ గా తేలడంతో, వచ్చిన వారు తిరిగిన ప్రాంతాలను పరీక్ష చేయడం కోసం ఏకంగా ఒక్కరోజులోనే ఆరు వేలకు పైగా ఇండ్లకు తిరిగి ప్రత్యేక వైద్య పరీక్షలు చేయడం జరిగింది.వైద్య సిబ్బందితో పాటు గౌరవనీయులైన మంత్రివర్యులు గంగుల కమలాకర్ కూడా వైద్య సిబ్బందితో ఉంటూ ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పిస్తూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు.
కష్టం వచ్చినప్పుడు అసలు ప్రేమ బయట పడుతుంది అని అంటారు, అలాగే  కరోన లాంటి మహమ్మారి ప్రపంచం మొత్తం విస్తరిస్తున్న సమయంలో తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎంతలా ప్రయత్నిస్తోందో, ప్రభుత్వం తరుపున పనిచేస్తున్న ప్రత్యేక వైద్య సిబ్బంది కూడా అంతే నిబద్ధతతో పని చేస్తున్నారు.గౌరవనీయులైన  తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ లో అత్యున్నతమైన  పారిశుద్ధ్యతను పాటించడం మాత్రమే కాకుండా వ్యాధి బారిన ఎవరూ పడకుండా తమ సాయశక్తులా పని చేస్తూ ప్రజల అందరి మన్ననలు తెలంగాణ వైద్య సిబ్బంది పొందుతున్నారు.
Top