You are here
Home > Latest News > కేంద్రం చేయలేనిది.. తెలంగాణ గుర్తించగలిగింది

కేంద్రం చేయలేనిది.. తెలంగాణ గుర్తించగలిగింది

Spread the love

 

కేంద్రం చేయలేనిది.. తెలంగాణ గుర్తించగలిగింది

  • తబ్లిగి పై కేంద్రానికి సమాచారం ఇచ్చిన తెలంగాణ
  • ఢిల్లీలోనే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నా గుర్తించని కేంద్రం
  • తెలంగాణ సమాచారం ఇస్తే తప్ప కదలని వైనం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తబ్లిగీ వ్యవహారం.. ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజాముద్దీన్ లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు హాజరై.. చాలా మంది కరోనా వ్యాప్తికి కారణమయ్యారన్న విషయం.. తెలంగాణ ప్రభుత్వం గుర్తించాకే దేశానికి తెలిసింది. ఢిల్లీ నడిబొడ్డున ఈ కార్యక్రమం జరిగినా.. ఇన్ని వేల మంది ప్రార్థనలకు హాజరైనా.. పర్యటక వీసాల పేరుతో మత ప్రచారం చేసినా.. కేంద్రం ఈ విషయాన్ని మాట మాత్రంగా కూడా గుర్తించలేకపోయింది.

ఎప్పుడైతే.. కరోనా ప్రభావం పెరగడం మొదలైందో.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర కోణంలో ఆ మూలాలు ఎక్కడున్నాయని శోధించిందో.. అప్పుడే వాస్తవం బయటపడింది. కేంద్రం వైఫల్యం దేశానికి తెలిసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్వయంగా.. కేంద్రమే ఈ విషయాన్ని ప్రకటించింది. తెలంగాణ నుంచి తమకు సమాచారం రాగానే.. అన్ని రాష్ట్రాలకు ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలిపింది.

అంతే కాదు.. ప్రచారానికి ఎందరు తరలారు.. అన్న వివరాలను కూడా వెల్లడించిన కేంద్రం.. మార్చి 21న దాదాపు 824 మంది విదేశీ తబ్లిగీ కార్యకర్తలు, వారితో పాటు స్వదేశానికి చెందిన మరో 2100 మంది మత ప్రచారకులు దేశమంతా పర్యటించారని తెలిపింది. అలాగే.. మరో 216 మంది విదేశీయులు.. 1500 మంది కార్యకర్తలు నిజాముద్దీన్ లోని మర్కజ్ లో ఉన్నారని వెల్లడించింది.

వీరందరి ఆరోగ్యం విషయంలో దేశం ఇప్పుడు చాలా కలవరపడుతోంది. మాట వరసకు చర్యలు తీసుకోవడం కాదని.. ఫలితాలను ఇచ్చేలా ప్రణాళిక అమలు చేయాలని కేంద్రానికి ప్రజలు హితవు పలుకుతున్నారు. విదేశాలకు చెందిన వారిని పంపించేసి.. స్వదేశంలో ఉన్న వారిని వ్యాధి తీవ్రత తగ్గేవరకూ క్వారంటైన్ చేయాలని.. వారు ఎవరెవరిని కలిశారన్నిది కూడా గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Top