You are here
Home > Latest News > గురుకుల పై దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు….

గురుకుల పై దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు….

Spread the love
  • గురుకుల పై దుష్ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు….
  • పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడంలో కొన్ని అసౌకర్యాలు ఉన్న మాట నిజమే…
  • త్వరలోనే అన్ని హంగులతో కూడిన భవనాలలోకి స్కూళ్లను చేర్చేందుకు ప్రభుత్వ ఏర్పాట్లు…
  • అప్పటివరకు ఓపిక పట్టాలని ప్రతిపక్షాలకు హితవు పలుకుతున్న ప్రజలు….
  • మీ హయాంలో ఎన్ని గురుకులాలు ఏర్పాటు చేశారు అని ప్రశ్నిస్తున్న జనం…

నిరు పేద పిల్లలకు కేజీ టు పీజీ విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల విద్యాలయాల పై ప్రతిపక్షాలు దుష్​ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెద్దమొత్తంలో గురుకులాలను ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోయింది. అయితే పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడంతో అక్కడక్కడా కొన్ని అసౌకర్యాలు నెలకొన్నాయి. త్వరలోనే వీటిని  తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అంతవరకు ఓపిక పట్టకుండా ప్రభుత్వాన్ని విమర్శించేలా ప్రతి పక్షాలకుచెందిన పత్రికలలో కథనాలు వస్తున్నాయి. దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో చేర్పించాలంటే.. ఫీజు లక్షల్లోనే ఉంటుంది. గురుకుల పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువు, భోజనం, వసతి అన్నీ ఉచితమే!సమర్థులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బోధనతోపాటు, 24 గంటల పర్యవేక్షణ ఉంటుంది. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని.. పరిష్కరించేందుకు హౌస్ మాస్టర్/హౌస్ పేరెంట్ వ్యవస్థ ఉంటుంది. ఐఐటీ, ఎంసెట్, నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో రాణించేలా నిపుణులు శిక్షణ అందిస్తారు.సెంట్రల్ యూనివర్సిటీలు, నల్సార్, టిస్, ఇఫ్లూ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా విద్యార్థులకు నిరంతరం మార్గనిర్దేశం చేస్తారు.పాఠ్యాంశాలతోపాటు క్రీడలు, యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, మార్షల్ ఆర్ట్స్, లలిత కళలు తదితరాలపైనా అవగాహన కల్పిస్తారు.విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా బహుమతులు అందిస్తారు. వీటన్నింటితోపాటు విద్యార్థులకు పోషకాహారం, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫామ్, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. ఇన్ని సౌకార్యాలున్న క్రమంలో ప్రజలు వీటికి బ్రహ్మరథం పడుతున్నారు.

మరోవైపు విద్యతోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్న నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. పీజీస్థాయి వరకూ ప్రతి విద్యార్థికీ ఉచితంగా చదువు చెప్పేందుకు కేజీ టూ పీజీ విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాఠశాలల్లో డ్రాపౌట్లకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా గురుకుల వ్యవస్థను దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా బలోపేతం చేసింది. ప్రత్యేక వ్యూహంతో వివిధ వర్గాల విద్యార్థులకు వేర్వేరుగా గురుకులాలను ఏర్పాటుచేసి, వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు, జనరల్ విద్యార్థుల కోసం కూడా గురుకుల విద్యాలయాలను పెద్ద ఎత్తున ప్రారంభించింది. జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నది. మూడున్నరేండ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని క్యాటగిరీలకు చెందిన రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య 298 మాత్రమే. ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో నాటి పాలకులు మొక్కుబడిగానే వీటిని నెలకొల్పారు. తెలంగాణ ఆవిర్భవించిన ఈ మూడున్నరేండ్లలోనే రాష్ట్రంలో గురుకులాల సంఖ్య ఏకంగా 815కు పెంచారు. కేవలం గురుకులాలను ఏర్పాటుచేయడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు. ఆయా విద్యాసంస్థల్లో నాణ్యతాప్రమాణాలను కూడా కార్పొరేట్ విద్యకు దీటుగా తీర్చిదిద్దారు. ఈ గురుకులాల్లో లక్షల మంది విద్యార్థులు చదువుకోవడం, రాష్ట్రంలో కేజీటు పీజీ విద్య వేసిన ముందడుగు. ఏడున్నరేండ్ల దీర్ఘకాలిక లక్ష్యంతో వేల గురుకులాలను ఏర్పాటుచేసి అనేక లక్షల మంది విద్యార్థులను ఉచితంగా విద్యనందించే ప్రణాళికతో తెలంగాణ సర్కారు దూసుకుపోతున్నది. ఇంతగా లక్ష్యసిద్ధితో ముందుకుపోతున్న ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శంచకూడదని ప్రజలు ప్రతిపక్షాలకు హితవు పలుకుతున్నారు.

Top