You are here
Home > Latest News > హైకోర్టుకు అస‌లు విష‌యం ఇప్పుడు అర్థ‌మైంది…

హైకోర్టుకు అస‌లు విష‌యం ఇప్పుడు అర్థ‌మైంది…

Spread the love
  • హైకోర్టుకు అస‌లు విష‌యం ఇప్పుడు అర్థ‌మైంది…
  • స‌మ్మె విష‌యంలో జోక్యం సాధ్యం కాద‌ని తేల్చింది
  • అందుకే లేబ‌ర్ కోర్టుకు రెఫ‌ర్ చేసింది

తెలంగాణ‌వాదులు మొద‌టి నుంచీ వాదనే క‌రెక్ట‌ని తేలింది. ఆర్టీసీ విష‌యంలో త‌మ‌ నిర్ణ‌యాల‌ను త‌ప్పుప‌ట్టే అవ‌కాశం కోర్టుకు లేద‌ని ప్ర‌భుత్వం చెప్పిన మాట‌ల‌ను నిజ‌మేన‌ని జ‌డ్జీలే అంగీక‌రించిన‌ట్ట‌యింది. చ‌ర్చ‌లు కూడా సాధ్యం కావ‌న్న విష‌యాన్ని ప్ర‌క‌టించింది. అందుకే ఈ విష‌యాన్ని లేబ‌ర్ కోర్టుకు రెఫ‌ర్ చేశారు. ఈ ప‌ని ఎప్పుడో చేయాల్సి ఉండె! ఆల‌స్యంగానైనా మంచి నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని లేబర్ కోర్టు లేదా ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌కు రెండువారాల్లో రిఫర్ చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.

తమ తీర్పు కాపీ అందిన రెండువారాల్లో చర్యలు తీసుకోవాలని, ఒకవేళ సమ్మె అంశాన్ని సరైన ఫోరానికి రిఫర్ చేయని పక్షంలో.. అందుకు కారణాలను ఆయాపక్షాలకు లిఖితపూర్వకంగా వెల్లడించాలని సూచించింది. ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమో కాదో తేల్చే అధికారం తమకు లేదని స్పష్టంచేసింది. తమ అధికార పరిధి మీరి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొన్నది. ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాలు చర్చలు జరిపి ఓ పరిష్కారానికి వచ్చేలా ఆదేశించాలని, ప్రజలకు సరైన రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై విచార‌ణ ముగించింది.

స‌మ్మె ప‌రిష్కారానికి చర్చలు జరుపాలని సూచించామని, కానీ.. అధికారులు, కార్మికులకు మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని తెలిపింది. చ‌ర్చ‌లు ఎందుకు స‌ఫ‌లం కాలేదో అంద‌రికీ తెలుసు. ప్ర‌భుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త బ‌స్సులు కొన‌డం, జీతాలు పెంచ‌డం అసాధ్య‌మ‌ని ఆర్టీసీ గురించి తెలిసిన వారు ఎవ‌రైనా చెబుతారు. యూనియ‌న్ల‌కే ఈవిష‌యం అర్థం కావ‌డం లేదు. అర్థం కాక కూడా కాదు.. ప్ర‌భుత్వాన్ని స‌తాయించ‌డానికే వీరి డ్రామాలు. ఇది బ‌హిరంగ ర‌హ‌స్యం.

Top