You are here
Home > Latest News > కాళేశ్వరంతో నీళ్లివ్వాలని సర్కారుకూ ఉంది.

కాళేశ్వరంతో నీళ్లివ్వాలని సర్కారుకూ ఉంది.

Spread the love

 

కాళేశ్వరంతో నీళ్లివ్వాలని సర్కారుకూ ఉంది.

  • కానీ.. కేసులు, కోర్టు చిక్కులతోనే అసలు సమస్య.
  • నిర్వాసితులు ఖాళీ చేస్తే.. మల్లన్నసాగర్ ఎప్పుడో పూర్తయ్యేది.
  • రెండేళ్లయినా మల్లన్నసాగర్ పూర్తి చేయలేదు….
  • రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పూర్తి కాలేదంటే కారణం??.
  • కేవలం కోర్టు కేసులే అన్నది అందరికీ తెలుసు.

కాళేశ్వరం విషయంలో వెలుగు పత్రిక రాతల్ని చూస్తే.. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుంది. ఎందుకంటే.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి వివేక్ మీడియా విషపు రాతలు రాస్తోంది. నిర్వాసితుల్ని రెచ్చగొట్టడం కేసులు పెట్టించడం.. కోర్టుల్లో పిటిషన్లు వేయడం లాంటివి వెనకుండి పోత్సహించింది. ప్రభుత్వం చేసే ప్రతీ చర్యను వ్యతిరేకించింది. ప్రభుత్వ భూముల్లో పనులు చేస్తున్నా.. పర్యావరణ అనుమతుల్లేవని ఒకసారి, ప్రజలు సాగు చేసుకుంటున్న భూములు ఎలా లాక్కుంటారని ఒకసారి పిచ్చి రాతలు రాసింది నిజం కాదా?. మల్లన్నసాగర్ విషయంలో.. ఏ మీడియా చూపని అత్యుత్సాహం చూపారు. వీ6, వెలుగు అధినేత వివేక్ దగ్గరుండి చాలామందితో కేసులు వేయించారు. దీనివల్లనే కదా కాళేశ్వరం ఫలాలు ప్రజలకు అందడం లేదు.

వెనకుండి చేసేది పక్కన పెట్టి.. కాళేశ్వరం ఫలితాలు అందడం లేదు. రెండేళ్లయినా కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చే పరిస్థితి లేదని.. పిచ్చి పిచ్చి రాతలు ఎందుకు?. వర్షాలు సరైన టైంలో కురవక పోయినా.. కనీసం పాత ఆయకట్టుకు అయినా పుష్కలంగా నీళ్లు అందాయంటే.. అది కాళేశ్వర పుణ్యమే కదా?. గతంలో నిర్మించిన ప్రాజెక్టులు, చెరువులు నేడు ఎండాకాలం కూడా నిండుకుండల్లా ఉన్నాయంటే కారణం కాళేశ్వరం కాదా?. పంటలు ఎండుతున్నాయంటే.. పెద్ద పెద్ద కాలువలకు సైతం గండికొట్టి నీళ్లు అందించింది ప్రభుత్వం. రైతును రాజు చేయాలని శత విధాలా ప్రయత్నిస్తున్న సర్కారుకు మోకాలడ్డే ప్రయత్నం చేస్తూనే విషపు రాతలు రాస్తున్నారు.

కాళేశ్వరం మరో ఏడాదిలో ఫుల్ ఫ్లెడ్జ్ డ్ గా.. నీళ్లను అందించడం జరుగుతుంది. ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడం జరుగుతుంది. కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయని.. కేసీఆర్ మానస పుత్రిక. దీనిపై విషపు రాతలు ఇప్పటికైనా మానుకోండి. 37లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం అంటే.. ఆషామాషీనా?. ఒక్కో రిజర్వాయర్ ను.. ఒక్కో పనిని ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా లేకుండా పూర్తి చేసుకుంటూ వస్తోంది సర్కార్. కరోనా, లాక్ డౌన్ కారణంగా ప్రాజెక్ట్ పనులు నెమ్మదించాయి. లేకపోతే.. ఈపాటికి కాళేశ్వరం నీళ్లు అనుకున్న విధంగా అందరికీ అందించేది సర్కార్.

Top