You are here
Home > Uncategorized > ఎందుకు మీ కొట్లాటా ? ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ?

ఎందుకు మీ కొట్లాటా ? ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ?

Spread the love
  1. ఎందుకు మీ కొట్లాటా ?
  2. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ?
  3. తెర వెనుక ఎవ‌రున్నారో అంద‌రికీ తెలుసు

ప్ర‌భుత్వంతో కొట్లాడి మ‌రీ ఆర్టీసీని ర‌క్షించుకుంటార‌ట‌! (భ‌క్షిస్తార‌ని అర్థం) తాజాగా ఆర్టీసీ యూనియ‌న్లు, అఖిల‌ప‌క్ష నాయ‌కులు చేసిన ప్ర‌క‌ట‌న ఇది. మీ కొట్లాట ఎవ‌రి కోస‌మో అంద‌రికీ తెలుసు. మీ పోరాటం వెనుక ఎజెండా ఏంటో ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిపోయింది. మీ అస‌లు కోరిక‌లు వేరే ఉన్నాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. దసరా ముందు సమ్మె చేస్తే ప్రభుత్వం దిగివస్తుందని , మీ వెంట మేము ఉంటామని , ఏం చేసైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న ఓ రాజకీయ పార్టీ వారికి హామీ ఇచ్చింది.

ఇంకేముంది.. పండుగ కు రెండు రోజుల ముందు పక్కాగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం సమ్మె ప్రారంభమైంది. ఇప్పటికే రెండు సార్లు వేతనాలు పెంచుకోవడం సహా ఆర్టీసీ కి చాలా ఆర్ధిక సహాయం అందించిన ప్రభుత్వం ఏం చేయాలి ? నాలుగు కోట్ల మంది తనను నమ్మి తన దారిలో నడిచి ఉద్యమించి సాధించిన తెలంగాణలో తనకే రెండు సార్లు అధికారాన్ని ప్రజలు ప్రేమతో కట్టబెడితే ఏం చేయాలి ? అశ్వద్ధామ రెడ్డి లాంటి వాళ్ళు సమ్మె పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తే ప్రజా ధనాన్ని పప్పు బెల్లం లెక్క పంచి పెట్టాలా ?

నోరు లేని పేదల నోటి కాడి కూడు లాగేసుకొని ఆసరా , రైతు బంధు వంటి పథకాలు ఎత్తేసి అశ్వద్ధామరెడ్డి లాంటి వాళ్ళ బ్లాక్ మెయిల్ కు లొంగాలా ? లేదా వాళ్ళకు పదవులు , డబ్బులు ముట్టజెప్పాలా ? ఇవి చేయడానికి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు కాదు. కేసీఆర్ . ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నాలుగు కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకుంటడు. కేవ‌లం ప‌ది మంది నాయ‌కులు, ఒక పార్టీ స్వార్థ‌ప్ర‌యోజ‌నాల కోసం జ‌రుగుతున్న స‌మ్మెకు ప్ర‌భుత్వం త‌ల‌వంచాలా ? దీనిని పోరాటంగా పిల‌వాలా ? 50 వేల మంది జీవితాల‌తో ఆట‌లాడుతున్న ఈ నాయ‌కుల‌పై ప్ర‌భుత్వం క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాలి. లేక‌పోతే ఇలాంటి న‌కిలీ ఉద్య‌మాలు మరిన్ని పుడుతాయి. ప్ర‌తి ఒక్క‌డూ ప్ర‌భుత్వాన్ని బెదిరిస్తాడు. చ‌ర్చ‌ల పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఇలా అయితే ప్ర‌జాస్వామ్య‌మే ప్ర‌మాదంలో ప‌డుతుంది.

Top