You are here
Home > Latest News > ఏందిరా నీ బాధ.. నీలా ప్రభుత్వం దిగజారలేదనేదేనా నీ సమస్య?

ఏందిరా నీ బాధ.. నీలా ప్రభుత్వం దిగజారలేదనేదేనా నీ సమస్య?

Spread the love

ఏందిరా నీ బాధ.. నీలా ప్రభుత్వం దిగజారలేదనేదేనా నీ సమస్య?

  • తప్పుడు రాజకీయాలతో బతికే రేవంత్ కూడా నీతులు మాట్లాడితే ఎలా
  • తప్పెక్కడ జరిగిందో తెలుసుకునే సమయం కూడా ఇవ్వకపోతే ఎలా
  • ప్రజాధానం దోచుకుతినే సర్కారు కాదిది.. కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది

యోగా చేయడానికి వెళ్లిన వ్యభిచారి.. ఆసనాల్లోనూ భంగిమలు వెతుక్కుందట. అట్లే ఉంది.. రేవంత్ రెడ్డి వైఖరి. తనకే నిజాయితీగా బతకడం చేతకాదు. అవినీతి, దోపిడీ లేకుండా బతకడం చేతకాదు. అలాంటి రాజకీయ వ్యభిచారి.. ఇప్పుడు ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుని రాద్ధాంతం చేస్తుండడం.. అలాంటోడికి ఇజ్జత్ లేనోల్లు తమ చానల్ లో వేదికను ఇస్తుండడం.. చూస్తే అసలు వీళ్ల బాధ ఏంటో అర్థం కాకుండా ఉంది అంటున్నారు.. రాష్ట్ర ప్రజలు.

కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు గండి పడింది నిజమే. నష్టం కూడా బాగానే జరిగింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ఆ నష్టాన్ని సాధ్యమైనంత త్వరగా రికవరీ చేయాలి. అలాగే నీటి వృథాను అరికట్టాలి. ప్రభుత్వం ఇప్పుడు అదే చేస్తోంది. ఇంతలోనే.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి చికిస్త చేస్తున్న వైద్యుడిని.. కసకసా నరికేసినట్టు ప్రవర్తిస్తే ఎలా రేవంత్ రెడ్డీ? ఈ తప్పునకు కారణం ఎవరన్నదీ తేలకుండానే.. ఎవరిమీద పడితే వారి మీద చర్యలు తీసుకోవాల్నా?

నువ్వు గతంలో ఉన్న టీడీపీ.. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ రెండూ కూడా.. జనానికి ఏం చేయని కారణంగానే కదా.. ప్రజాబలం లేక మూలకు పడింది. అది అర్థం చేసుకోకుండ ఎట్ల పడితే అట్ల నోరు పారేసుకుంటె ఎట్ల రెడ్డీ? కేసీఆర్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ప్రజాసంక్షేమమే అంతిమ ధ్యేయంగా ఉంటుంది. ఆ దిశగానే పని చేస్తోంది కూడా. అలాంటప్పుడు.. ఈ గండికి ప్రభుత్వమే కారణం అంటే ఎట్లా?

కుట్ర జరిగిందో.. అభివృద్ధిపై నీలాంటి రాజకీయ వ్యభిచారుల కన్ను పడిందో. కారణం ఏదైనా.. తప్పు తేలక మానదు. కారకులకు శిక్ష పడక మానదు. అప్పటిదాకా ఈ రాజకీయ రంకుబొంకు మాటలు మాట్లాడకుంటే ఉంటేనే నీకు మంచి రేవంత్ రెడ్డీ. అట్ల కాదు.. ఇట్లనే కూస్త.. రాజకీయంగ బట్టలిప్పుకుని తిరుగుత అంటె.. నీ ఖర్మకు ఎవడు బాధ్యుడు కాదన్న సంగతి కూడ గుర్తుంచుకో.

Top