You are here
Home > Latest News > ప‌ని చెయ్య‌రు.. జీత‌మంటె ఎట్ల ?

ప‌ని చెయ్య‌రు.. జీత‌మంటె ఎట్ల ?

Spread the love
  • ప‌ని చెయ్య‌రు.. జీత‌మంటె ఎట్ల ?
  • ఇచ్చేందుకు ఆర్టీసీ ద‌గ్గ‌ర డ‌బ్బేలెవి
  • ఆస్తులు అమ్మ‌డ‌మే మార్గం

ఆర్టీసీ కార్మికుల‌కు సెప్టెంబ‌రు నెల‌కు జీతాలు ఇవ్వ‌లేమ‌ని యాజ‌మాన్యం హైకోర్టుకు విస్ప‌ష్టంగా చెప్పింది. ఈ విష‌యంపై కొంద‌రు సోష‌ల్ మీడియాలో అంగీలు చింపుకుంటున్నరు. గింత అన్యాయ‌మా అంటూ బుగ్గ‌లు నొక్కుకుంటున్న‌రు. ఇలాంటి విమ‌ర్శ‌లు చేసే స‌న్నాసులు ప్రాక్టిక‌ల్‌గా ఆలోచించ‌ట్లేదు. ఆర్టీసీ ఖాతాలు ఉన్న డ‌బ్బులు ఒక్క రోజుకు ప‌నికి జీతం ఇచ్చేందుకు కూడా స‌రిపోవు. అలాంటి దుస్థితికి రావ‌డానికి కార‌ణం ఎవ‌రు ? స‌మ్మె పేరుతో డ్రామాలు ఆడుతున్న యూనియ‌న్లు. వారిని ప్రోత్స‌హిస్తున్న ప్ర‌తిప‌క్షాలు. కూచున్న చెట్టును న‌రుక్కొని నీడ లేదంటే ఎలా ? అన్నం పెట్టే సంస్థ‌కు క‌న్నం బెట్టి ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం ? పేమెంట్​ ఆఫ్​ వేజెస్​ యాక్ట్​ ప్రకారం ఒక రోజు డ్యూటీకి డుమ్మా కొడితే ఎనిమిది రోజుల జీతం కట్‌ చేసే అధికారం ఆర్టీసీకి ఉంటుంది. కార్మికులు చెప్పాపెట్టకుండా డ్యూటీలకు గైర్హాజరు అయ్యారు. వేజెస్​ యాక్ట్​ ప్రకారం వారికివ్వాల్సిన జీతాన్ని కట్​ చేసుకునేందుకు మేనేజ్​మెంట్​కు అధికారం ఉంటుంది.  ఆర్టీసీ కార్మికుల‌ను ఇబ్బందిపెట్టాల‌నే ప్ర‌భుత్వం ఏనాడూ అనుకోలేదు. యూనియ‌న్లే సీఎం కేసీఆర్‌ను విప‌రీతంగా రెచ్చ‌గొట్టాయి. ఉద్యోగాలిస్తాం ర‌మ్మని కోరినా..మా ముందు నువ్వెంత అనే స్థాయిలో రెచ్చిపోయాయి. కేసీఆర్ వీళ్ల‌కు మూడుసార్లు చాన్సిచ్చాడు. ఉద్యోగాల్లో చేరండి బాగా చూసుకుంటా అని భ‌రోసా కూడా ఇచ్చాడు. పిలిచి పిల్ల‌నిస్త‌నంటే వ‌ద్ద‌న్న‌ట్టు.. అప్పుడు కేసీఆర్ మాట‌ల‌ను ఖాత‌రు చేయ‌లేదు. ఇప్పుడు జీతాలు ఇవ్వండి అంటే ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించుకోవాలి. మీ పిచ్చి వేషాల వ‌ల్ల ఆర్టీసీకి ఎన‌లేని న‌ష్టం జ‌రిగింది. లేబ‌ర్ కోర్టు తీర్పు వ‌చ్చేదాకా వెయిట్ చేయ‌డం మిన‌హా ఆర్టీసీ కార్మికుల‌కు ఎలాంటి ప్ర‌త్యామ్నాయం లేదు.

Top