You are here
Home > Latest News > 52 రోజులు స‌మ్మె చేస్తే ఇప్పుడు డ్యూటీ అంటె ఎట్ల‌

52 రోజులు స‌మ్మె చేస్తే ఇప్పుడు డ్యూటీ అంటె ఎట్ల‌

Spread the love
  • న‌చ్చిన‌ట్టు చేస్తే ఎట్ల కుదురుత‌ది ?
  • 52 రోజులు స‌మ్మె చేస్తే ఇప్పుడు డ్యూటీ అంటె ఎట్ల‌
  • దైనికైనా కొన్ని రూల్స్ ఉంటాయి కదా!

అర్థంప‌ర్థం లేని, ప‌స‌లేని పిచ్చి డిమాండ్ల‌తో 52 రోజుల‌పాటు ప్ర‌భుత్వాన్ని, ప్ర‌జ‌ల‌ను, ఆర్టీసీ కార్మికుల‌ను స‌తాయించిన యూనియ‌న్లు గ‌తిలేని ప‌రిస్థితుల్లో నిన్న స‌మ్మెను విర‌మించిన‌ట్టు ప్ర‌క‌టించాయి. అర్జెంటుగా డ్యూటీల్లోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేశాయి. అయితే యూనియ‌న్ నాయ‌కుల స్వ‌రంలో ఎలాంటి మార్పూ లేదు. భ‌విష్య‌త్‌లోనూ విలీనం డిమాండ్ లేవ‌నెత్తుతామ‌ని, క‌మీష‌న‌ర్ నిర్ణ‌యాన్ని బ‌ట్టి భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు.

అంతేత‌ప్ప‌, ఇక నుంచి బుద్ధిగా డ్యూటీ చేసుకుంటామ‌ని, స‌మ్మెల జోలికి వెళ్ల‌బోమ‌ని మాత్రం చెప్ప‌లేదు. అంటే యూనియ‌న్ల నాయ‌కుల స్వ‌భావంలో ఎటువంటి మార్పూ రాలేదు. అశ్వ‌త్థామ రెడ్డి, రాజిరెడ్డి వంటి దొంగ‌ల‌ముఠా ప్ర‌వ‌ర్త‌న కొంచెం కూడా మార‌లేదు. వీరికి ఈసారి అవ‌కాశం ఇస్తే ఆర్టీసీని నాశ‌నం చేయ‌డానికి మ‌రోసారి ప్ర‌య‌త్నించ‌ర‌న్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకే ప్ర‌భుత్వం వీరిని విధుల్లోకి అనుమ‌తించ‌డం లేదు. డ్యూటీకి రానిస్తే మ‌ళ్లీ ఆగం ఆగం చేస్త‌ర‌న్న ఆందోళ‌న ప్ర‌భుత్వంలో ఉంది.

అందుకే నిన్న కేసీఆర్ గ‌వర్న‌ర్ స‌హా ప‌లువురితో చ‌ర్చించారు. ఆర్టీసీ కార్మికుల‌ను ఇబ్బందిపెట్టాల‌నే కేసీఆర్ ఏనాడూ అనుకోలేదు. యూనియ‌న్లే ఆయ‌న‌ను విప‌రీతంగా రెచ్చ‌గొట్టాయి. ఉద్యోగాల్లో చేర‌డానికి మూడు చాన్సులు ఇచ్చారు. అయినా ఖాత‌రు చేయ‌లేదు. ఇప్పుడు డ్యూటీల్లో చేరతానంటే ప్ర‌భుత్వం ఎందుకు ప‌ట్టించుకోవాలి? యూనియ‌న్ల‌ వ‌ల్ల ఆర్టీసీకి ఎన‌లేని న‌ష్టం జ‌రిగింది. పండ‌గ ఆదాయం పోయింది. న‌ష్టాలు ఘోరంగా పెరిగాయి కాబ‌ట్టి ప్ర‌భుత్వానికి స‌హ‌జంగానే కార్మికుల‌పై కాస్త కోపం ఉంటుంది. అందుకే కొన్ని ష‌ర‌తులతో వీరిని ఉద్యోగాల్లోకి తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఇందుకు కాస్త స‌మ‌యం ప‌ట్టొచ్చు.

Top