You are here
Home > Latest News > నిజమే.. మేధావుల మౌనం ప్రమాదకరమే.. కానీ!!

నిజమే.. మేధావుల మౌనం ప్రమాదకరమే.. కానీ!!

Spread the love

అన్ని వర్గాలూ అయిపోవడంతో.. ఇప్పుడు వృత్తి విద్యానిపుణులపై పడ్డారు కాంగ్రెస్ నేతలు. సాంకేతికంగా కుట్రలు చేసేందుకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్న కాంగ్రెస్ దుర్మార్గులు.. ఇప్పుడు ఐటీ నిపుణలతోనూ సమావేశం అయ్యారు. వారిని కుట్రల అమలులో తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అలాగే.. కొత్త కమిటీలను కూడా వేసుకున్నారు. ఆ కమిటీలు ఇచ్చే సూచనలను ఎన్నికల ప్రణాళికలో చేర్చుతామని కూడా సెలవిచ్చారు.

ఈ కుట్రల భేటీలో.. ఉత్తమ్, జానా, గీతారెడ్డి నుంచి మొదలు పెడితే.. కాంగ్రెస్ కు పీపీటీలు ఇచ్చే కాంట్రాక్టు అందుకున్నట్టుగా ప్రవర్తించే దాసోజు శ్రవణ్ కూడా ఉన్నాడు. ఇందులో మాట్లాడిన వాళ్లంతా.. పార్టీ బలోపేతం గురించి ప్రస్తావిస్తారని అనుకుంటే.. ఎప్పటిలాగే కేసీఆర్ ఫోబియాతో మాట్లాడిన వారి వైఖరి.. ఓ రకంగా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే.. కనీసం ఐటీ ప్రొఫెషనల్స్ తో అయినా.. వారు రాజకీయాలు కాకుండా పార్టీ పటిష్టత… రాజకీయ వ్యూహాలు సంభాషిస్తారని జనం కూడా అంచనా వేశారు.

కానీ.. అదో ఫక్తు ఎన్నికల ప్రచార సభను తలపించినట్టుగా నిర్వహించడం.. త్వరలోనే రాహుల్ కూడా వస్తారని చెప్పడం చూస్తుంటే.. కాంగ్రెస్ నేతల ఆలోచనలు ఒకవైపు.. సభ నిర్వహణ తీరు మరోవైపు అన్నట్టుగా కనిపించింది. ఆ సభకు హాజరైన వాళ్లు కూడా.. టెక్నాలజీ వాడుకోవడంలో సహకరిస్తాం కానీ.. దుర్వినియోగం చేస్తామంటే సహకరించము.. అని వారిలో వారు చర్చించుకున్నట్టుగా ఆఫ్ ద రికార్డ్ గా వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం టెక్నాలజీని వాడుకుని జనంలోకి వెళ్లి.. అబద్ధాలు ప్రచారం చేయాలని చూస్తున్నారు. సభ నిర్వహణతో తమ ఉద్దేశాన్ని కాంగ్రెస్ నేతలు స్పష్టంగా బయటపెట్టుకున్నారు. ఈ విషయంలో జనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Top