You are here
Home > Latest News > అబద్ధాల పునాదులు.. అవే కాంగ్రెస్ ఆయుధాలు

అబద్ధాల పునాదులు.. అవే కాంగ్రెస్ ఆయుధాలు

Spread the love

కాంగ్రెస్ పార్టీ తనకు మాత్రమే సాధ్యమైన అబద్ధాల ఆయుధాలను మళ్లీ జనంపై ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. అందుకు.. పార్టీ వేదికలను.. పార్టీ సభలను ప్రచారానిక వాడుకుంటోంది. గెలిచే అవకాశమే లేని కాంగ్రెస్ పార్టీ.. భ్రమల్లో బతుకుతూ.. వచ్చేది తమ ప్రభుత్వమే అని డబ్బాలు కొట్టుకుంటోంది. సర్వేల్లో కేసీఆర్ ప్రభుత్వానికే జనాలు జై కొడుతున్నారని తేలుతున్నా.. వాటిని బుల్డోజ్ చేస్తూ తమకే 70 సీట్లు వస్తాయని కాంగ్రెస్ తెగ ప్రచారం చేసుకుంటోంది.

అలాగే.. విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు చాలా మంది చాలా రకాలుగా ప్రారంభించారు. కానీ.. వాటిని చిత్తశుద్ధితో పూర్తి చేసిన ప్రభుత్వాలు కొన్నే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వరుసగా పదేళ్లు అధికారంలో ఉంది. నిజంగా చిత్తశుద్ధే ఉంటే.. అప్పుడే భూపాలపల్లి, జైపూర్ విద్యుత్ ప్లాంట్లను అందుబాటులోకి తేవాల్సి ఉంది. అదే జరిగితే.. అధికారం కూడా వారికే సొంతమై ఉండేదేమో. కానీ.. జనాన్ని అడ్డంగా మోసగించి.. జనం సొమ్మును కాజేసి.. కాంగ్రెస్ నేతలకు అందినకాడికి దండుకునేందుకే ఆ పదేళ్లూ సరిపోలేదు. అందుకే.. జనాలు ఆ పార్టీని ఇంటికి పంపించారు.

కానీ.. కేసీఆర సర్కార్ వచ్చింది. అవినీతిని నిర్మూలించింది. రికమండేషన్లను నో చెబుతోంది. పారదర్శక పాలన అందిస్తోంది. ఖర్చులకు తగిన లెక్కలను కూడా అంతే పారదర్శకంగా చూపిస్తూ.. పనులను శరవేగంగా పూర్తి చేయించింది. పనులు ఎవరైనా ప్రారంభిస్తారు… కానీ.. వాటిని సమర్థంగా జనానికి మంచి జరిగే విధంగా పూర్తి చేయగలిగిందే అసలైన ప్రభుత్వం అని నిరూపిస్తోంది. ఇది చూసి భయంతో బిక్కచచ్చిపోతున్న కాంగ్రెస్ దొంగలు.. జనాల్లో మళ్లీ నానేందుకు తమకే 70 సీట్లు వస్తాయని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు.

Top