You are here
Home > Latest News > తెగిన గాలిపటంలా మారిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. 

తెగిన గాలిపటంలా మారిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. 

Spread the love
పీసీసీ చీఫ్ గా నువ్వు విఫలం కాబట్టే మార్పు ఉత్తమ్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనుకోవడం కళ్ళే.
తెగిన గాలిపటంలా మారిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.
తెలంగాణ రాష్ట్ర పిసిసి చీఫ్ మార్పు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవిని ఎలాగైనా తన వద్ద అట్టిపెట్టుకోవాలనే ఉద్దేశంతో దిక్కుమాలిన సభలు పెట్టి ప్రజల్లో మూక దంపుడు ప్రసంగాలు చేస్తున్నాడు.ఎన్నడూలేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఇంత దుర్గతి పట్టింది అంటే దానికి కారణం పిసిసి చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కి వెళ్ళి తీవ్రమైన పరాభావాన్ని చూసింది.తన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తగిలింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.తనని పీసీసీ చీఫ్ గా అధికారంలో నుండి తీసేస్తారు అన్న భావనలో ఉత్తంకుమార్ రెడ్డి పిచ్చి ప్రసంగాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావడం అనేది కళ్ళ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెగిన ఒక గాలిపటం లో మారింది అని దిశానిర్దేశం చేసే వ్యక్తులు ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే వ్యక్తులు కూడా ఉండరు అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లుగా తెలంగాణ ప్రజలని గాని, దేశ ప్రజలని మోసం చేసిన దానికి ఇప్పుడు ప్రాయశ్చిత్తము అనుభవిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని చిత్ర కథలు పడ్డా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిసిసి చీఫ్ ఇచ్చే పరిస్థితి లేదు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలకి పెట్టింది పేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఐదుగురు నేతలైన అంతర్గత కలహాలు మాత్రం తారా స్థాయిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో  వాళ్ళలో వాళ్ళకే పడటం లేదు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు చేసిన అభివృద్ధిని చూసి టిఆర్ఎస్ పార్టీ లోకి కొందరు చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మిగిలేది మట్టే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భావిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ఇక నైనా దేశంలో దుకాణం బంద్ చేసుకొని పోతే బాగుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Top