You are here
Home > Uncategorized > వాటాలు చెప్పమనే ముందు.. జనం నీ తాట తీయకుండా చూస్కో వివేక్..!

వాటాలు చెప్పమనే ముందు.. జనం నీ తాట తీయకుండా చూస్కో వివేక్..!

Spread the love

 

వాటాలు చెప్పమనే ముందు.. జనం నీ తాట తీయకుండా చూస్కో వివేక్..!

– కృష్ణా జలాల వివాదంపై బిజినెస్ మన్ వివేక్ వాటాల వ్యాఖ్యల వివాదం

– కమిషన్లు అంటూ ఆరోపిస్తూ.. నిరూపించలేక విమర్శిలకే పరిమితం అవుతున్న వైనం

– సహించేది లేదని తేల్చి చెబుతున్న యావత్ తెలంగాణ ప్రజానీకం

ఒకప్పటి కాంగ్రెస్ నేత.. మాజీ టీఆర్ఎస్ నేత.. ప్రస్తుత బీజేపీ నేత.. బడా బిజినెస్ మన్.. వేల కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత.. ఓ ఛానల్, ఓ పత్రికను నడిపిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలను నిరాటంకంగా కొనసాగిస్తున్న మీడియా అధినేత. ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్న రాజకీయ పదవులు పిపాసి వివేక్ వెంకటస్వామి.. కేసీఆర్ గురించి స్థాయిని మంచిన మాటలు మాట్లాడుతున్నడు. విమర్శలు చేస్తున్నడు.

కృష్ణా జలాల వివాదంలో మేఘా సంస్థను లాగుతున్నడు… వివేక్. ప్రాజెక్టుల అంచనాలు పెంచి.. కేసీఆర్ కమిషన్లు తీసుకుంటున్నారని అంటున్నడు. కానీ.. గాలి మాటలు చెప్పడమే తప్ప.. మరో పని చేయలేకపోతున్నడు. రాజ్యాంగబద్ధంగా కాంట్రాక్టును ఇచ్చినా.. కాలానుగుణంగా అంచనా వ్యయం పెరిగినా.. అదేదో తప్పుడు పని అన్నట్టు కామెంట్లు చేస్తున్నడు. ఇదే వివేక్ వెంకటస్వామి.. తాను గతంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసిందో మరుస్తున్నడు.

జలయజ్ఞం పేరుతో.. వైఎస్ లాంటి నేతలు ధనయజ్ఞాలు చేసి.. లక్షల కోట్ల రూపాయలు దండుకున్న విషయాన్ని ప్రస్తావించడం లేదు. కానీ.. రీ డిజైనింగ్ తో లక్షలాది ఎకరాలు పచ్చగా మారేలా చేసిన కేసీఆర్ ను మాత్రం అనవసరంగా విమర్శిస్తున్నడు. నిరాధారంగా ఆరోపిస్తున్నడు. అందుకే.. వివేక్ కు యావత్ తెలంగాణ ప్రజలు ఓ విషయం స్పష్టం చేస్తున్నరు. చేతనైతే మంచి చేయండి.. లేదంటే జరిగే మంచిని అడ్డుకోకండి అని తేల్చి చెబుతున్నరు.

ఇప్పుడు ఎలాగూ కేంద్రంలో అధికార పార్టీలోనే ఉన్నారు కదా.. ఆ అడ్వాంటేజ్ తో.. రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టో.. అదనపు నిధులో.. కనీసం కరోనా ప్రత్యేకంగా ఓ 50 వేల కోట్లో తీసుకువస్తే.. అప్పుడు ఆయన తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉన్నట్టు లెక్క.. అని జనం అంటున్నరు. అదేదీ లేకుండా.. కేసీఆర్ ను తిట్టేందుకే రాజకీయాలు చేస్తా అంటే.. రాజకీయ బొంద తవ్వి.. నిట్ట నిలువునా పాతరేస్తం అని హెచ్చరిస్తున్నరు.

Top